https://oktelugu.com/

RRR vs KGF 2 Box Office Collection: షాకింగ్ : అక్కడ ఆర్ఆర్ఆర్ కి 20 కోట్లు, కేజీఎప్ కి 45 కోట్లు !

RRR vs KGF 2 Box Office Collection: షార్ప్ అండ్ స్టైలిష్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వచ్చిన`కేజీఎఫ్ చాప్టర్- 2` ఈ రోజు బాక్సాఫీస్‌పై దాడి చేసింది. అయితే హిందీ బెల్ట్‌లో RRR చిత్రం తొలి రోజు రూ. 20 కోట్లకుపైగా వసూలు చేయగా, KGF2 దానికి రెట్టింపు వసూలు చేసింది. సుమారు రూ. 45 కోట్లు తొలిరోజే కలెక్షన్స్ రాబట్టింది. ఆల్‌ ఓవర్‌గా తీసుకుంటే […]

Written By:
  • Shiva
  • , Updated On : April 14, 2022 / 01:30 PM IST
    Follow us on

    RRR vs KGF 2 Box Office Collection: షార్ప్ అండ్ స్టైలిష్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వచ్చిన`కేజీఎఫ్ చాప్టర్- 2` ఈ రోజు బాక్సాఫీస్‌పై దాడి చేసింది. అయితే హిందీ బెల్ట్‌లో RRR చిత్రం తొలి రోజు రూ. 20 కోట్లకుపైగా వసూలు చేయగా, KGF2 దానికి రెట్టింపు వసూలు చేసింది. సుమారు రూ. 45 కోట్లు తొలిరోజే కలెక్షన్స్ రాబట్టింది. ఆల్‌ ఓవర్‌గా తీసుకుంటే మొదటి రోజు రూ. 100 కోట్లు కలెక్ట్ చేసింది.

    RRR vs KGF 2 Box Office Collection

    దీంతో ‘రికార్డ్స్.. రికార్డ్స్.. రికార్డ్స్.. రాఖీకి ఇది ఇష్టం ఉండదు. కానీ రికార్డ్స్ రాఖీని ఇష్టపడతాయి’ అంటూ నెటిజన్లు ట్వీట్ చేశారు. మొత్తానికి సినిమాలో అదనపు హంగులు కోరుకుంటారనే మేకర్స్ అన్ని ఎమోషన్స్ తో పాటు యాక్షన్ అండ్ అద్భుత విజువల్స్ ను నింపేశారు. మొదటి పార్ట్ అధ్యాయం ముగిసిన పాయింట్‌ తో ఈ సినిమా ప్రారంభమైంది. రాఖీ, అధిరా మరియు రమికా సేన్ మధ్య జరిగిన డ్రామా తాలూకు ఎలివేషన్ సీన్స్ అండ్ బిల్డప్ సీన్స్ అదిరిపోయాయి. సినిమా చాలా పవర్ ఫుల్ గా ఉంది.

    Also Read: Flops: తమిళ మూవీస్ వరుస ప్లాపుల వెనుక రీజనెంటీ?

    ముఖ్యంగా యశ్ చెప్పిన డైలాగ్ లు చాలా బాగున్నాయి. ఇక ఈ కథలోని కీలక సంఘటనల గురించి ప్రకాష్ రాజ్ ఎలివేట్ చేసిన విధానం కూడా బాగుంది. మొత్తమ్మీద ఈ సినిమా ప్రేక్షకులపై గట్టి ముద్రనే వేసింది. మెయిన్ గా విజువల్స్ అత్యున్నతంగా ఉన్నాయి. ఖచ్చితంగా అందరినీ అలరిస్తాయి. పైగా కీలక పాత్రలను దర్శకుడు చాలా చక్కగా డిజైన్‌ చేశాడు. దీనికితోసు అద్భుతమైన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ కూడా సినిమా స్థాయిని పెంచింది.

    RRR vs KGF 2 Box Office Collection

    యావత్తు భారతదేశం ఎదురు చూసిన కొన్ని మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఈ సినిమా కూడా ఒకటి. మొదటి పార్ట్ బంపర్ హిట్ కావడంతో ఈ చిత్రం కోసం అన్ని భాషలలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇంతకీ కేజీఎఫ్ అనగా కోలార్ బంగారు గ‌నులు. కోలార్ బంగారు గ‌నుల నేపథ్యంలో మాఫియా క‌థతో ఈ సినిమా తెర‌కెక్కింది.

    ఏది ఏమైనా 2018లో సంచలన విజయం సాధించిన కెజిఎఫ్ అత్యంత ప్రజాదరణ పొందింది. పైగా మొదటి పార్ట్ ను మించి అనేక ప్రత్యేకతలు కెజిఎఫ్ 2లో ఉండబోతున్నాయి. కానీ.. ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. రేపటి నుంచి కలెక్షన్స్ భారీగా పడే ఛాన్స్ ఉంది.

    Also Read:
    RRR vs KGF 2 Collections: RRR 3 రోజుల కలెక్షన్స్ ని కేవలం ఒక్క రోజులోనే దాటేసిన KGF చాఫ్టర్2

    Tags