
టాలీవుడ్ ప్రముఖ హీరో ప్రభాస్ బాహుబలి సినిమా తరువాత ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. దీంతో ప్రభాస్ గురించి ఏం చెప్పినా విశేషమే అవుతుంది. తాజాగా ఆయన ఫాం హౌజ్ గురించి తీవ్రంగా చర్చ సాగుతోంది. అ ఫాం హౌజ్ విలువ ఎంత..? ఆ ఫాం హౌజ్ ఎక్కడేందని రకరకాలుగా అనుకుంటున్నారు. ప్రస్తుతం రాధేశ్యామ్ షూటింగ్ లో బీజీ అయిన ప్రభాజ్ ఫాంహౌజ్ వివరాలేంటో చూద్దాం..
Also Read: ఎలిమినేటైన అవినాష్ కి నాగార్జున అదిరిపోయే గిఫ్ట్
హైదరాబాద్ శివార్లలో ప్రభాస్ కు అందరి సెలబ్రెటీలకు ఉన్నట్లే ఫాం హౌజ్ ఉంది. షూటింగ్ విరామం సమయంలో ఆయన ఇక్కడే గడుపుతారట. అయితే ఈ ఫాం హౌజ్ విలువ రూ. 60 కోట్లట. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ సైతం షాక్ తింటున్నారు. ఈ ఫాం హౌజ్ లో చెట్లతో చిన్నపాటి అడవినే తయారు చేస్తున్నాడట.
రాజ్యసభ ఎంపీ గ్రీన్ ఛాలెంజ్ ఇండియా పేరుతో సెలబ్రీటీలతో మొక్కలు నాటిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ కు కూడా సంతోష్ ఛాలెంజ్ విసిరి మొక్కలు నాటించారు. ఆ మొక్క నాటింది తన ఫాం హౌజ్ లోనే. ప్రస్తతం ఈ ఫాం హౌజ్ నిర్వహణ ప్రభాస్ టీం దగ్గరుండీ మరీ మెయింటనెన్స్ చేస్తున్నారట. భవిష్యత్ లో ప్రభాస్ తన పూర్తి జీవితాన్ని ఇక్కడే గడిపే అవకాశం ఉందని అనుకుంటున్నారు.
Also Read: డిసెంబర్ 31.. జబర్దస్త్ వర్సెస్ ఢీ..!
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. రాధేశ్యామ్ షూటింగ్ బిజీలో ఉన్న ఆయన ఆ తరువాత ఆదిపురుష్, అనంతరం సాలార్ సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ సినిమాలకు సంబంధించిన పోస్టర్లు ఇప్పటికే విడుదలయ్యాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్