Kalki 2898 AD: ప్రభాస్ సలార్ తో సక్సెస్ ట్రాక్ ఎక్కారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ వరల్డ్ వైడ్ రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ జోరులో ఆయన కల్కి 2829 AD, రాజా సాబ్ చిత్రాలు పూర్తి చేస్తున్నాడు. కల్కి యూనిట్ ఇటీవలే విదేశాల్లో ఓ షెడ్యూల్ పూర్తి చేశారు. ఈ షెడ్యూల్ నందు దిశా పటాని, ప్రభాస్ పాల్గొన్నారు. దిశా పటాని, ప్రభాస్ పక్క పక్కనే ఉన్న రొమాంటిక్ ఫోటో ఒకటి వైరల్ గా మారింది. ప్రభాస్ సదరు ఫోటోలో అద్భుతంగా ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ఆయన బెస్ట్ లుక్ అని చెప్పొచ్చు.
కాగా నేడు మహాశివరాత్రి పండగ నేపథ్యంలో సర్ప్రైజింగ్ అప్డేట్ ఇచ్చారు కల్కి టీమ్. ఈ మేరకు ఓ పోస్టర్ విడుదల చేశారు. శివలింగంతో కూడిన ఆ పోస్టర్ లో అప్డేట్ డిటైల్స్ పొందుపరిచారు. మార్చి 8, అనగా నేడు సాయంత్రం 5:00 గంటలకు కల్కి మూవీలో ప్రభాస్ పేరు రివీల్ చేస్తారట. ‘అతని పేరు ఏమిటీ?… సాయంత్రం తెలియజేస్తాం’ అని పోస్టర్ లో పొందుపరిచారు. ఈ సడన్ సర్ప్రైజ్ కి ప్రభాస్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా పండగ వేళ కల్కి టీమ్ ఫ్యాన్స్ ని ఫిదా చేశారు. అలాగే కల్కి సమ్మర్ కానుకగా మే 9న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే వాయిదా పడే అవకాశం కలదని టాలీవుడ్ టాక్. చెప్పిన తేదీకి రావాలని నిరంతరం ప్రాజెక్ట్ పై శ్రమిస్తున్నారు. ఒక ప్రక్క షూటింగ్ మరో ప్రక్క పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుందని సమాచారం. మూడు స్టూడియోలో విఎఫ్ఎక్స్ వర్క్ చేస్తున్నారట.
కాగా కల్కి సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీ దత్ నిర్మిస్తున్నాడు. ప్రభాస్ కి జంటగా దీపికా పదుకొనె, దిశా పటాని నటిస్తున్నారు. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్స్ ఈ ప్రాజెక్ట్ లో భాగం అయ్యారు. దాదాపు రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్ కల్కి చిత్రానికి కేటాయించారు. ఇది టైం ట్రావెలర్ కథ అట.
The world knows him as…
Revealing at 5 PM!
Team #Kalki2898AD wishes you all a very Happy #MahaShivaratri! #Prabhas #Kalki2898ADonMay9 pic.twitter.com/kfuR1M8Z3t
— Kalki 2898 AD (@Kalki2898AD) March 8, 2024