Bigg Boss 7 Telugu: టైటిల్ రేసులో ఉన్న శివాజీ నేను బయటకు వెళ్ళిపోతా అని పలుమార్లు అన్నాడు. అది ఆయనకు ఊతపదం గా ఉంది. నాగార్జున కూడా ఒకటి రెండు సార్లు ఆ పదం వాడొద్దని హెచ్చరించాడు. లేదు బాబు గారు బాధేసినప్పుడు నిజంగా వెళ్లిపోవాలనిపిస్తుందని శివాజీ చెప్పాడు. 11వ వారం బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ కి పిలిచిన బిగ్ బాస్ ఆరోగ్య పరిస్థితి అడిగాడు. చేయి నొప్పి పూర్తిగా తగ్గలేదని శివాజీ అన్నాడు. రానున్న వారాల్లో గేమ్స్ ఇంకా టఫ్ గా ఉంటాయి. చేతికి ఏదైనా అయితే బాధ్యత నీదే అని బిగ్ బాస్ హెచ్చరించాడు.
హౌస్ లో ఉండేది లేదని చెప్పాలని అడిగాడు. ఆలోచించుకుని చెబుతా అన్న శివాజీ.. కాసేపటి తర్వాత వెళ్ళిపోతా బిగ్ బాస్ అని చెప్పాడు. ఇంకా మూడు వారాల గేమ్ మాత్రమే ఉంది ఆలోచించుకుని చెప్పు అని బిగ్ బాస్ అన్నాడు. లేదు వెళ్ళిపోతాను అని శివాజీ అన్నాడు. అయితే తర్వాత నాగార్జున మాట్లాడాడు. నీకు ఇబ్బంది అనిపించిన రోజు వెళ్ళిపో అప్పటి వరకు ఉండు అన్నాడు.
ఇంత చెప్పినా శివాజీ ఇంటి నుండి వెళ్ళిపోతా అనే పదం వదలడం లేదు. ఈసారి ఏకంగా ప్రేక్షకులనే బయటకు పంపేయాలని కోరుకున్నాడు. ఆడియన్స్ నన్ను ఎలిమినేట్ చేయండని నేరుగా చెప్పాడు. అమర్ తన విషయంలో ప్రవర్తించిన తీరు నచ్చడం లేదు. అందుకే ఈ హౌస్ నుండి వెళ్ళిపోవాలి అనుకుంటున్నట్లు శివాజీ చెప్పాడు. ఈసారి ప్రేక్షకులనే కోరుకున్నారు
నిజంగా ఆడియన్స్ సీరియస్ గా తీసుకుంటే శివాజీకి మైనస్ అవుతుంది. ఎలిమినేట్ కాకపోయినా ఫైనల్ లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పటికే పల్లవి ప్రశాంత్ శివాజీని దాటేశాడు. అతడికి ఎక్కువ ఓటింగ్ నమోదు అవుతుంది. అమర్ కూడా టైటిల్ రేసులోకి వస్తున్నాడు. ఈ క్రమంలో శివాజీ టైటిల్ ఫేవరేట్ ట్యాగ్ కోల్పోయే ప్రమాదం ఉంది. చివరి దాకా వచ్చి శివాజీ టైటిల్ గెలుచుకునే ఛాన్స్ కోల్పోతున్నాడు.