Shivaji: బిగ్ బాస్ తెలుగు 7 ఘనంగా ముగిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా టైటిల్ విన్నర్ ఎవరనే ఉత్కంఠ నడిచింది. శివాజీ, అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అనుకున్నట్లే ఈ ముగ్గురు టాప్ 3లో నిలిచారు. మొదట శివాజీ ఎలిమినేట్ అయ్యారు. అమర్-ప్రశాంత్ టైటిల్ పోరులో నిలిచారు. నాగార్జున పల్లవి ప్రశాంత్ ని విన్నర్ గా ప్రకటించారు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన శివాజీ ఎవరినీ కలవలేదు. మీడియాతో మాట్లాడలేదు. కాగా ఆయన ఓ వీడియో విడుదల చేశాడు. ఆసక్తికర కామెంట్స్ చేశారు.
బిగ్ బాస్ హౌస్ తనకు చాలా నేర్పిందన్న శివాజీ… హోస్ట్ నాగార్జునను ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశాడు. బిగ్ బాస్ సీజన్ 7 సక్సెస్ లో నాగార్జున పాత్ర ఉంది అన్నారు. ఆయన ప్రతి వారం వచ్చి మా తప్పు ఒప్పులపై చేసే రివ్యూ చాలా బాగుండేది. ఒక మాస్టర్ వలె అనిపించేవారు. నాగార్జున విషయంలో నేను చాలా తగ్గాను. ఆయనతో ఆచితూచి మాట్లాడేవాడిని. నేను ఎవరికీ భయపడను. ఆయన వద్ద తగ్గాను. నాగార్జున నాకు మొదటి అవకాశం ఇచ్చిన వ్యక్తి.
స్టార్ మా శివాజీని తొక్కేసింది. నన్ను పక్కన పెట్టి పల్లవి ప్రశాంత్ కి టైటిల్ ఇచ్చారని కొందరు అంటున్నారు. అది నిజం కాదు. పల్లవి ప్రశాంత్ నా బిడ్డ. రైతుబిడ్డ. నేను కూడా వ్యవసాయ కుటుంబం నుండి పరిశ్రమకు వచ్చాను. వాడు రైతుబిడ్డగా బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టాడు. సామాన్యుడు గెలవాలి. పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు. త్వరలో మిమ్మల్ని కలుస్తాను… అని శివాజీ వీడియో ముగించాడు.
శివాజీ హౌస్లో పల్లవి ప్రశాంత్ కి మద్దతుగా నిలిచాడు. శివాజీ, ప్రశాంత్, యావర్ లు స్పై బ్యాచ్ గా పేరు తెచ్చుకున్నారు. శివాజీ టైటిల్ గెలవడం ఖాయం అనుకున్నారు. ఆయన మైండ్ గేమ్ తో ప్రేక్షకులను అలరించారు. పల్లవి ప్రశాంత్ మరింత దూకుడు చూపించడంతో శివాజీ రేసులో వెనుకబడ్డారు. అదే సమయంలో చివర్లో శివాజీ కొంత నెగిటివిటీ మూటగట్టుకున్నాడు. ఆ కారణంగా టైటిల్ దూరమైంది.
#Shivaji talking to audience after BB show. #Sivaji – “ I will not accept the accusations that ‘BB team intentionally put me in 3rd place’ ”#BIGGBOSSTELUGU7
— BigBoss Telugu Views (@BBTeluguViews) December 18, 2023