Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 ముగింపు దశకు చేరుకుంది. దీంతో టైటిల్ విన్నర్ ఎవరు అవుతారు అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. బిగ్ బాస్ విన్నర్ ఎవరంటే మొన్నటి వరకు వినిపించిన పేరు శివాజీ. ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ వరకు కూడా .. శివాజీ టైటిల్ విన్నర్ అని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ తర్వాత అసలైన ఆట మొదలైంది. అంచనాలు .. టైటిల్ లెక్కలు అన్ని తారుమారయ్యాయి. అయితే ప్రతి సీజన్ లో 80 ఎపిసోడ్ల తర్వాత జరిగే ఫ్యామిలీ వీక్ .. ఈ సీజన్ లో ముందే నిర్వహించారు.
ఫ్యామిలీ వీక్ లో వచ్చిన సభ్యులంతా శివాజీకి నెంబర్ 1 స్థానం ఇచ్చారు. దీంతో శివాజీ విన్నర్ అని అంతా భావించారు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే .. ఈ సీజన్ లో ఐదు వారాల ముందే ఫ్యామిలీ వీక్ పెట్టడంతో మిగిలిన ఐదు వారాల గేమ్ గేమ్ కీలకంగా మారింది. అయితే 11వ వారం నుంచి బిగ్ బాస్ అసలు ఆట మొదలు పెట్టాడు. శివాజీ తప్పులు బయట పెడుతూ వరుసగా రెండు వారాలు నెగిటివ్ ఫుటేజ్ వదిలాడు.
ముఖ్యంగా 11 వారంలో శివాజీ ని ఓ రేంజ్ లో ఏకిపారేసాడు హోస్ట్ నాగార్జున. ఇక 12వ వారంలో కెప్టెన్సీ విషయంలో అమర్ కి మాటిచ్చి తప్పడంతో శివాజీ బాగా నెగిటివ్ అయ్యాడు. దీంతో అమర్ కి సింపతీ బాగా వర్కౌట్ అయింది. అప్పటి వరకు అమర్ దీప్ ని తిట్టిన వాళ్ళే పాపం అని జాలి పడ్డారు. దీంతో అమర్ గ్రాఫ్ బాగా పెరిగిపోయింది. అమర్ విన్నర్ అవుతాడు అనే చర్చలు కూడా సాగాయి.
అయితే 13వ వారం నామినేషన్స్ శివాజీకి మళ్ళీ పాజిటివ్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే ఆట సందీప్ .. బిగ్ బాస్ విజేత గురించి ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు. ఆయన ఏమన్నారంటే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కి శివన్న అర్హుడు .. ఆయనతో పాటు ప్రశాంత్ కూడా అర్హుడే నా లెక్క ప్రకారం శివన్న విన్నర్ అవుతాడు. ప్రైజ్ మనీ రూ. 50 లక్షలు మాత్రం ప్రశాంత్ కి ఇవ్వొచ్చు. వాళ్ళిద్దరి మధ్య ఆ బాండింగ్ ఉంది. శివన్న మైండ్ గేమ్ బాగా ఆడుతున్నాడు .. ఆయనే విన్నర్ అవుతారు. ఇక ఏమవుతుందో మీరే చూస్తారుగా అని ఆట సందీప్ అన్నారు.