Shivaji second innings: చాలామంది నటులు హీరోగా తమ కెరియర్ ని మొదలుపెట్టి ఆడపాదడపా సినిమాలు చేస్తున్నారు. ఇక హీరోగా కెరియర్ ముగిసిపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొత్త అవతారం ఎత్తి వాళ్ళని వాళ్లు కొత్త గా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే నటుడు శివాజీ సైతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలన్ గా తన ప్రతాపాన్ని చూపించే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ సంవత్సరం వచ్చిన కోర్టు మూవీ సూపర్ సక్స్ అయింది. అందులో శివాజీ పోషించిన మంగపతి క్యారెక్టర్ ప్రతి ప్రేక్షకుడిని మెప్పించింది. ఆ పాత్రకి శివాజీ తప్ప మరే నటుడు కూడా న్యాయం చేయలేడు అనేంత గొప్పగా నటించి మెప్పించిన శివాజీ రీసెంట్ గా వచ్చిన దండోరా సినిమాలో తండ్రి పాత్రలో అదరగొట్టాడు. పాత్ర ఎలాంటిదైనా సరే అలావోక నటించి మెప్పించగలిగే సత్తా తనకు ఉందని మరోసారి ప్రూవ్ చేశాడు. ఇక స్టార్ హీరోల సినిమాల్లో కూడా తనకు అవకాశం వస్తే విజృంభిస్తానని చెబుతున్నాడు.
విలన్ పాత్రలను చేయడం తనకు చాలా ఇష్టమని అలాంటి పాత్ర దొరికితే మాత్రం ఎవర్ గ్రీన్ క్యారెక్టర్ గా నిలిచిపోయే విధంగా నటించి మెప్పిస్తానని చెబుతున్నాడు…ఇక ఇదిలా ఉంటే శివాజీ రీసెంట్ దండోరా మూవీ ఈవెంట్ లో హీరోయిన్లు వేసుకునే డ్రెస్ ల మీద ఆయన కామెంట్లు చేసి కొన్ని విమర్శలైతే మూటగట్టుకుంటున్నాడు.
ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఈ టాపిక్ మీద స్పందిస్తున్నారు. శివాజీ బహిరంగంగా వచ్చి క్షమాపణలు చెప్పిన కూడా ఆ టాపిక్ ని వదిలేయకుండా ఒక్కొక్క సెలబ్రిటీ వచ్చి ఆ విషయం మీద స్పందించడంతో అది చాలా పెద్ద వివాదంగా ముదురుతుంది. ఇక శివాజీ అనసూయ మధ్య నడుస్తున్న వైరంగా దిన్ని పరిగణిస్తున్నారు.
ఇక ఈ మొత్తం టాపిక్ కి పులిస్టాప్ ఎప్పుడు పడుతోంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ వివాదంలో కొంతమంది శివాజీని సపోర్ట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఉంది అంటుంటే, మరికొంతమంది మాత్రం నెగెటివ్ గా స్పందిస్తున్నారు. అలాగే అనసూయని సైతం కొంతమంది సపోర్ట్ చేస్తుంటే, ఇంకొంతమంది విమర్శిస్తూ ఉండడం విశేషం…