Shivaji: ప్రముఖ నటుడు శివాజీ(Sivaji) నిన్న జరిగిన ‘దండోరా'(Dandora Movie) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్స్ ని ఉద్దేశించి మాట్లాడిన కొన్ని మాటలు పెను దుమారం రేపాయి. స్త్రీలకు అందం చీరలోనే ఉంటుంది, సామాన్లు కనిపించే దుస్తుల్లో కాదు, అలాంటి దుస్తులు వేసుకున్నప్పుడు ప్రేక్షకులు ఎవరు ఈ దొంగ ముం** అని తిట్టుకుంటారు అంటూ వ్యాఖ్యానించాడు. ఆయన మంచి ఉద్దేశ్యంతోనే మాట్లాడి ఉండొచ్చు, కానీ ఆయన ఉపయోగించిన పదాలు చాలా దారుణమైనవి. మంచు మనోజ్, మంచు లక్ష్మి, చిన్మయి, యాంకర్ అనసూయ వంటి వారు శివాజీ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. సోషల్ మీడియా లో నెటిజెన్స్ కూడా ఆయన్ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. గతం లో బిగ్ బాస్ షో లో కూడా లేడీ కంటెస్టెంట్ శోభా శెట్టి పై ఇలాగే శివాజీ నోరు పారేసుకున్నాడని, ఇతనికి స్త్రీలు అంటే గౌరవం లేదంటూ నెటిజెన్స్ మండిపడుతున్నారు.
తన వ్యాఖ్యలపై వస్తున్న వ్యక్తిరేకతను గమనించిన శివాజీ కాసేపటి క్రితమే క్షమాపణలు చెప్తూ ఒక వీడియో ని విడుదల చేసాడు. అందులో ఆయన మాట్లాడుతూ ‘నిన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్స్ ఈమధ్య కాలం లో వాళ్ళు ఇబ్బంది పడిన సందర్భాల్లో, నాలుగు మంచి మాటలు చెప్పాలని చెప్తూనే, రెండు అసభ్యకరమైన పదాలు వాడడం జరిగింది. అలాంటి మాటలకు కచ్చితంగా మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలను అందరినీ ఉద్దేశించి కాదు, హీరోయిన్స్ బయటకు వెళ్లినప్పుడు, బట్టలు జాగ్రత్తగా వేసుకుంటే మీకు ఇబ్బంది ఉండదు అమ్మా అని చెప్పే ఉద్దేశ్యమే నాది. అంతే కానీ ఎవరినీ అవమాన పరిచే ఉద్దేశ్యం నాకు లేదు, కానీ ఏదైనా రెండు అసభ్యకరమైన పదాలు నా నోటి నుండి దొర్లినాయి, అందుకు హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్తున్నాను. స్త్రీ అంటే ఒక మహాశక్తి , ఒక అమ్మవారిగానే నేను అనుకుంటాను, ఎందుకంటే ఇవాళ సమాజం లో స్త్రీ ని ఎంత తక్కువగా చూస్తున్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం. అలాంటి సమాజం లో తక్కువ గా చూసేవాళ్లకు అవకాశం ఇవ్వొద్దు అనే చెప్పడమే నా ఉద్దేశ్యం. ఆ ఫ్లో లో నేను ఊరి భాష ని ఉపయోగించాల్సి వచ్చింది. నా ఉద్దేశ్యం మంచిదే కానీ, ఆ రెండు పదాలు దొర్లకుంటే ఈరోజు ఇంత పెద్ద గొడవ అయ్యేది కాదు. ఇండస్ట్రీ లో ఆడవాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నందుకు, అదే విధంగా స్త్రీ సమాజం దీనిని తప్పుగా అర్థం చేసుకొని ఉండుంటే దయచేసి నన్ను క్షమించండి’ అంటూ చెప్పుకొచ్చాడు శివాజీ.
“My intention was good, but my choice of words was wrong.”
– #Sivaji’s public apology to actresses and women.
pic.twitter.com/YFmrtUSN53— Gulte (@GulteOfficial) December 23, 2025