కేసులో అనేక ట్విస్టులు, టర్న్ లతో పలు విషయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. బ్యాంకు వ్యవహారాలను సైతం అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి లకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు కూడా పలు సందేహాలకు కేంద్ర బిందువులుగా మారుతున్నాయి. దీంతో ఈడీ రంగంలోకి దిగి పరిష్కార మార్గాలు కనుగొనేందుకు పాట్లు పడుతున్నట్లు తెలుస్తోంది.
హాట్ షాట్, హాట్ హిట్, బాలీఫేమ్ వంటి యాప్ ల ద్వారా సమకూరిన ఆదాయంపై పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. ఈ యాప్ ల ద్వారా వచ్చిన ఆదాయం ఉమ్మడి ఖాతాలకు మళ్లినట్లు తెలుస్తోంది. రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి జాయింట్ ఖాతాలో రూ. కోట్ల మేర ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు సమాచారం. వాటి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో రాజ్ కుంద్రాకు రెండు ఖాతాలు ఉన్నాయి. వాటిని 2016 నుంచి ఉపయోగించలేదు. కనీస బ్యాలెన్స్ కూడా పెట్టలేదు.
జులై 23న ముంబై క్రైమ్ పోలీసులు శిల్పాశెట్టి ఇంటిపై దాడి చేయడంతో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై ఆమెను ప్రశ్నించిన పోలీసులకు సమాధానం రాలేదు. కొన్నింటికి సమాధానాలు చెప్పలేక తప్పించుకున్నారు. రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి రానున్న రెండు రోజుల్లో జులై 26న ఈడీ అధికారులు రంగంలోకి దిగుతారని తెలుస్తోంది.