Homeఎంటర్టైన్మెంట్Shilpa Shetty Husband Raj Kundra: 119 అశ్లీల చిత్రాలకు 9 కోట్లు !

Shilpa Shetty Husband Raj Kundra: 119 అశ్లీల చిత్రాలకు 9 కోట్లు !

Shilpa Shetty Husband Raj KundraShilpa Shetty Husband Raj Kundra: అశ్లీల చిత్రాల కింగ్ రాజ్‌కుంద్రా బాగోతాల గురించి ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు కొన్ని షాకింగ్ సంగతులు బయటపెట్టారు. విచారణలో భాగంగా అతగాడి ఫోన్‌, ల్యాప్ టాప్, హాట్‌ డ్రైవ్‌ డిస్క్‌ లను చెక్ చేస్తే.. వాటిల్లో మొత్తం 119 నీలి చిత్రాలు ఉన్నాయట. కాగా ఆ వీడియోలకు గానూ రాజ్ కుంద్రా రూ.9 కోట్లకు బేరం కూడా పెట్టుకున్నట్లు పోలీసులు అధికారికంగా వెల్లడించారు.

మొత్తానికి ఇన్నాళ్లు పెద్ద మనిషిగా చలామణి అయిన రాజ్‌కుంద్రా నీలి వ్యవహారాల దెబ్బకు బాలీవుడ్‌ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. బాలీవుడ్ లో అప్పటి నుంచి నీలి ప్రకంపనలు రగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే, ఈ అశ్లీల చిత్రాల సృష్టికర్తకు బెయిల్ దొరికింది గానీ, అతని పై నమోదు అయిన కేసులు మాత్రం, ఇప్పట్లో రాజ్ కుంద్రాను వదిలిపెట్టేలా లేవు.

అశ్లీల ప్రపంచంలో ఆ రేంజ్ లో పేరుప్రఖ్యాతలను సాధించాడు రాజ్‌ కుంద్రా. నిజానికి అరెస్ట్‌ కి ముందువరకు రాజ్ కుంద్రా అంటే.. ప్రముఖ వ్యాపారవేత్త అని ఒక గౌరవం ఉండేది. కానీ ఒక్క అరెస్ట్ తో రాజ్ కుంద్రా జీవితం తారుమారైంది. ఆయన గారి లీలల పై అనేక కథనాలు ఇంకా వస్తూనే ఉన్నాయి.

ఇక ముంబై పోలీసుల కస్టడీలో దాదాపు మూడు నెలలు పాటు మగ్గిపోతూ నిన్న బెయిల్ తో బయటకు వచ్చాడు. బయటకు వచ్చినా పోలీసులు మాత్రం విచారణ పేరుతో రాజ్ కుంద్రాకి గ్యాప్ కూడా ఇవ్వడం లేదు. ఇక తన ముద్దుల భర్త అరెస్ట్‌ అయ్యాక, మొదట్లో అతనికి బాగానే సపోర్ట్ చేసింది శిల్పాశెట్టి. కానీ, ఆ తర్వాత నుంచి భర్తకు దూరంగా ఉంటూ వస్తోంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version