https://oktelugu.com/

Shilpa Choudhary: కిలాడీ లేడీ.. తేలని కోట్ల గారడీ

Shilpa Choudhary: దేశంలో మోసాలకు కొదవే లేదు. మోసపోయేవాడు ఉన్నంత కాలం మోసం చేసే వారుంటారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే కోట్లాది రూపాయలు బురిడీ కొట్టించి దేశాలు విడిచి పారిపోయిన వారి జాబితా ఎక్కువగానే ఉంటోంది. అయినా ఏం చేయలేని పరిస్థితి. చిన్న చిన్న దొంగతనాలు చేసిన వాడికి దేహశుద్ధి చేసే జనం కోట్లు కొట్టేసిన వాడికి మాత్రం సలాం చేస్తూ సకల మర్యాదలు చేయడం పరిపాటే. ఇందులో నీరవ్ మోదీ, సుజనా చౌదరి, వైసీపీ రెబల్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 13, 2021 7:21 pm
    Follow us on

    Shilpa Choudhary: దేశంలో మోసాలకు కొదవే లేదు. మోసపోయేవాడు ఉన్నంత కాలం మోసం చేసే వారుంటారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే కోట్లాది రూపాయలు బురిడీ కొట్టించి దేశాలు విడిచి పారిపోయిన వారి జాబితా ఎక్కువగానే ఉంటోంది. అయినా ఏం చేయలేని పరిస్థితి. చిన్న చిన్న దొంగతనాలు చేసిన వాడికి దేహశుద్ధి చేసే జనం కోట్లు కొట్టేసిన వాడికి మాత్రం సలాం చేస్తూ సకల మర్యాదలు చేయడం పరిపాటే. ఇందులో నీరవ్ మోదీ, సుజనా చౌదరి, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వంటి వారు ప్రముఖులు. అయినా వారి మీద ఈగ కూడా వాలదు.

    Shilpa Choudhary

    Shilpa Choudhary

    ఈ నేపథ్యంలో దేశంలో పలువురి నుంచి కోట్టు సేకరించి మోసానికి పాల్పడిన శిల్పా చౌదరి ఉదంతం కూడా వెలుగులోకి వచ్చింది. ఆమెను పోలీసులు మూడు రోజుల కస్టడీకి తీసుకుని విచారించినా ఆమె నుంచి ఏమీ సేకరించలేకపోయారు. పైగా ఆమె ఖాతాలో రూ. 16 వేలు, ఆమె భర్త ఖాతాలో రూ. 14 వేలు మాత్రమే ఉండటం సంచలనం సృష్టిస్తోంది.

    కిట్టీ పార్టీల పేరుతో కోట్లు కొట్టేసినా ఎక్కడ కూడా సాక్ష్యాలు లేకుండా చేసింది. దీంతో పోలీసులు ఆమె విషయంలో తలలు పట్టుకుంటున్నారు. దోచిన సొమ్ము ఎక్కడ దాచిందో చెప్పడం లేదు. పోలీసుల విచారణలో వారితో వాగ్వాదానికి దిగుతోంది. మనీ ట్రాంజాక్షన్ కు సంబంధించిన లావాదేవీలు మాత్రం కనిపించడం లేదు. దీంతో ఆమె నుంచి నిజం రాబట్టేది ఎలా అని ఆలోచిస్తున్నారు.

    Also Read: Anchor Ravi: వారి మీద సైబ‌ర్ క్రైమ్‌ పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన యాంక‌ర్ రవి..!

    ఆమెపై వందల కోట్లు కాజేసిందని ఫిర్యాదులు వచ్చినా ఇప్పటివరకు రూ. ఏడు కోట్ల వరకు మాత్రమే లెక్క తేలింది. మిగతా సొమ్ము ఎక్కడ దాచింది? ఏం చేసిందనే దానిపై మాత్రం నిజాలు చెప్పడం లేదు. అధిక వడ్డీ ఇష్తామని ఆశ చూపించడంతో ఎడాపెడా డబ్బులు జమ చేసినట్లు తెలుస్తోంది. అయితే రూ.32 కోట్ట వరకు మోసాలకు పాల్పడి కూడబెట్టినట్లు గుర్తించినట్లు చెబుతున్నారు దీంతో కిలాడీ లేడీ బాగోతంపై ఇంకా లోతైన విచారణ చేపట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

    Also Read: Bollywood: బాలీవుడ్ హీరోయిన్లు కరీనా కపూర్, అమృతా అరోరా లకు కరోనా పాజిటివ్…

    Tags