Shekhar Basha: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో మంచి ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది శేఖర్ బాషా అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. సమయం దొరికినప్పుడల్లా కంటెస్టెంట్స్ తో సరదాగా గడపడం, వాళ్ళతో జోక్స్ వేయడం, ఆ జోక్స్ సోషల్ మీడియా లో కూడా వైరల్ అవ్వడం, ఇలా వచ్చిన వారం రోజుల్లోపే శేఖర్ బాషా కావాల్సినంత కంటెంట్ ఇచ్చాడు. అందుకే ఆయన హౌస్ లోకి అడుగుపెట్టేముందు ప్రేక్షకులకు పెద్దగా ముఖ పరిచయం లేకపోయినా తొందరగా సేవ్ అయ్యాడు, ఎలిమినేషన్ రౌండ్ లోకి రాలేదు. కానీ శేఖర్ బాషా రెండవ వారం లో పూర్తిగా డల్ అయిపోయాడు.
కారణం ఆయన భార్య గర్భవతి అవ్వడం, రెండు మూడు రోజుల్లో డెలివరీ అవ్వబోతుండడం. బిడ్డ సురక్షితంగా బయటకి వస్తుందా లేదా, ఇద్దరు క్షేమంగా ఉంటారా లేదా అని కంగారు పడుతూ, దిగులుతో శేఖర్ బాషా గేమ్ సరిగా ఆడలేకపోయాడు. దీంతో ఆయనకీ సంబంధించిన కంటెంట్ బయటకి రాలేదు. ఫలితంగా ఎలిమినేషన్ రౌండ్ వరకు వచ్చాడు. అయితే ఆయనని జనాలు ఎలిమినేట్ చేయలేదు, హౌస్ మేట్స్ ఎలిమినేట్ చేసారు. ఇది చాలా అన్యాయమైన ఎలిమినేషన్ అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉండగా శేఖర్ బాషా బయటకి రాగానే అనేక ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూస్ లో ఆయన బిగ్ బాస్ అనుభవాలను, బయటకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలను పంచుకున్నాడు.
ఆయన మాట్లాడుతూ ‘ఇంటికి వెళ్లి నా భార్య బిడ్డని చూడాలని చాలా తపన పడ్డాను. కానీ నా భార్య ఎందుకొచ్చావ్ అని అరిచింది. ఇక్కడ నేను బాగానే ఉన్నాను, నన్ను చూసుకోవడానికి మనుషులు ఉన్నారు, బిగ్ బాస్ లో టాప్ 5 వరకు ఉంటావు అని కోరుకుంటే ఇంత తొందరగా ఎలిమినేట్ అయ్యి వస్తావా, వెళ్ళిపో వెనక్కి అని అనింది. మూడు రోజుల నుండి నా మనసు నా దగ్గర లేదు. ఆట ఆడలేకపోయాను, అందుకే ఎలిమినేట్ అయ్యి వచ్చేసాను అని ఆమెకి చెప్పాను. కానీ ఆమె నా ఎలిమినేషన్ ని తీసుకోలేకపోయింది. నాకు కూడా చాలా బాధగానే అనిపించింది కానీ, నా బిడ్డని చేతిలోకి తీసుకోగానే అవన్నీ మర్చిపోయాను. మళ్ళీ వైల్డ్ కార్డు ద్వారా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం బిగ్ బాస్ ఇస్తే కచ్చితంగా వెళ్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు శేఖర్ బాషా. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఈ విషయం లో గత సీజన్ కంటెస్టెంట్ అర్జున్ ని మెచ్చుకోవాలి. ఆయన హౌస్ లోకి అడుగుపెట్టినప్పుడు కూడా, అతని భార్య నిండు గర్భిణీ. అయినప్పటికీ కూడా ఎమోషన్స్ కి గురి అవ్వకుండా, హౌస్ మొత్తం దద్దరిల్లిపోయేలా గేమ్ ఆడి తన సత్తా చాటాడు. శేఖర్ బాషా కూడా అలా చేసుంటే బాగుండేది అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అభిప్రాయం.