Shekhar Basha : గత సీజన్ లో లాగ ఈ సీజన్ లో ఆడియన్స్ విపరీతంగా కనెక్ట్ అయ్యే కంటెస్టెంట్స్ ఎవరు లేరనే చెప్పాలి. కానీ ఉన్నవారిలో శేఖర్ బాషా ఎంటర్టైన్మెంట్ పంచుతూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే ముందు ఆయన రాజ్ తరుణ్ – లావణ్య వ్యవహారం లో మీడియా ముందుకు వచ్చి ఎంత ఫైర్ ని చూపించాడో మన అందరికీ తెలిసిందే. అంతటి ఫైర్ ని చూపించిన శేఖర్ బాషా బిగ్ బాస్ హౌస్ లో ఇంత ఎంటర్టైన్మెంట్ పంచుతాడని ఎవ్వరూ ఊహించలేకపోయారు. అంతే కాదు శేఖర్ బాషా బయట ఎక్కువగా మగవాళ్లకు సపోర్టు చేస్తూ ఆడవాళ్లపై విరుచుకుపడేవాడు. కానీ బిగ్ బాస్ లో ఆయన అందరితో సరిసమానంగా ఉంటూ ఫన్నీ గా గడిపేస్తున్నాడు. శేఖర్ బాషా జెమినీ మ్యూజిక్ లో యాంకర్ గా వ్యవహరిస్తున్నప్పుడు ఎన్నో ఆణిముత్యాలు వదిలేవాడు.
ఆయన వదిలే ఆణిముత్యాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉండేది. ఇప్పుడు అలాంటి ఆణిముత్యాలను బిగ్ బాస్ హౌస్ లో వదులుతున్నాడు. వాటిని సోషల్ మీడియాలో నెటిజెన్స్ షేర్ చేస్తూ నవ్వుకుంటున్నారు. ఆయన వదిలిన ఆణిముత్యాలలో కొన్ని ఇప్పుడు మేము మీ ముందు ఉంచబోతున్నాము. రాత్రులు మంచి మూడ్ వస్తుంది ఎందుకో తెలుసా అని నిఖిల్ ని అడుగుతాడు శేఖర్ బాషా. చాయ్ త్రాగడం వల్ల అని నిఖిల్ అంటాడు. దానికి శేఖర్ బాషా సమాధానం చెప్తూ ‘కాదు..రాత్రి..త్రి అంటే మూడు కదా..రా త్రి అని పిలవగానే రాకుండా ఎందుకు ఉంటుంది’ అని అంటాడు. యష్మీ గౌడా ని ఒక ప్రశ్న అడుగుతూ ‘ A నుండి Z వరకు గోల్డెన్ లెటర్స్ అన్నిటిని అలా పేర్చి ఉంటారు. అప్పుడు ఒక దొంగ ఆ గోల్డెన్ లెటర్స్ నుండి ఒక లెటర్ దొంగిలిస్తాడు. ఆ లెటర్ ఏమిటి?’ అని అడుగుతాడు. దానికి యష్మీ ఏమి సమాధానం చెప్పాలో తెలియక ఆలోచిస్తుండగా శేఖర్ బాషా M అని సమాధానం ఇస్తాడు. M అంటే మనీ నే కదా అని యష్మీ అడగగా, దానికి శేఖర్ బాషా సమాధానం చెప్తూ ‘M అంటే M దొంగ..యమదొంగ’ అని సమాధానం చెప్తాడు.
దీనికి యష్మీ కి మైండ్ బ్లాక్ అయ్యి, ఒక విచిత్రమైన ఎక్స్ ప్రెషన్ పెడుతుంది. ఇక్కడితో ఆయన ఆపేయలేదు, ముంబై అనే పదానికి అర్థం కూడా మార్చేశాడు. ముంబై మా మేనమామ ఊరు అని అంటాడు. అది ఎలా అని కంటెస్టెంట్స్ అడగగా ‘ముం అంటే అమ్మ, భాయ్ అంటే అన్నయ్య..అమ్మ కి అన్నయ్య మేనమామ అవుతాడు కదా, అందుకే మా మేనమామ ఊరు అని చెప్పాను’ అంటూ శేఖర్ బాషా వదిలిన ఈ ఆణిముత్యం ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. ఇతని ఆణిముత్యాలను చూసిన తర్వాత బిగ్ బాస్ చూడని ప్రేక్షకులు కూడా శేఖర్ బాషా కోసం చూడాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Mumbai – Menamama Illu#Shekharbasha #BiggBossTelugu8 pic.twitter.com/7hgS4Jl2UD
— PAVAN SAI (@PAVANSAI99949) September 6, 2024