Shekar Kammula టాలీవుడ్ లో స్టార్ హీరోలు లేకుండా హిట్ కొట్టి చూపించగల ఒకే ఒక దర్శకుడు శేఖర్ కమ్ముల అనే చెప్పాలి. తన కొత్త సినిమా కి కొత్త నటులను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తారు శేఖర్ కమ్ముల. పల్లెటూరు నుండి పట్నం వరకు అతను తెరకెక్కించే కథలు పేదరాశి పెద్దమ్మ కథల వినే కొద్దీ వినాలనిపించేలా… చూసే కొద్దీ చూడాలనిపిస్తూ ఉంటాయి. శేఖర్ కమ్ముల సోషల్ మీడియాలో సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూ ఉంటారు.
కుటుంబ నేపథ్యంతో తెరకెక్కించి ఈయన సినిమా చూసినంత సేపు ప్రేక్షకులను మరో ప్రపంచానికి పరిచయం చేస్తారు ఈ దర్శకుడు.ఇటీవల జరిగిన ఒక సామాజిక అంశంపై శేఖర్ కమ్ముల అందరి హృదయాలను గెలుచుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా తెలంగాణలోని సూర్యాపేట జిల్లా నేలమర్రి గ్రామంలో ఓ రైతుకు సాయం అందించారు. కప్పల లక్ష్మయ్య, అతని సోదరులు తమ పొలాన్ని ఇటీవల అమ్మేశారు. ఇందులో లక్ష్మయ్య 10 లక్షలు వచ్చింది. పొలం అమ్మిన డబ్బుతో ఇల్లు కట్టుకోవాలి అనుకున్నారు. ఇంటి నిర్మాణం కోసం” 6 లక్షల రూపాయలు ” ఇంట్లో బీరువాలో దాచి పెట్టాడు.
లక్ష్మయ్య వంట చేసుకుందామని గ్యాస్ స్టవ్ వెలిగించగా అప్పటికే గ్యాస్ లీకై ఉండడంతో మంటలు అంటుకున్నాయి. గుడిసె పూర్తిగా కాలిపోయినా… లక్ష్మయ్య మంటల్లో నుంచి క్షేమంగానే బయట పడ్డారు. బీరువాలో ఉన్న డబ్బు కాలిపోయిందని …శేఖర్ కమ్ముల ఓ టివి ఛానల్ కథనం ద్వారా తెలుసుకున్నారు. లక్ష్మయ్య బ్యాంకు ఖాతాకు నేరుగా ఒక లక్ష బదిలీ చేసి మంచి మనసు చాటుకున్నాడు. లక్ష్మయ్యకు అండగా ఉంటానని శేఖర్ కమ్ముల హామీ ఇచ్చాడు.