Rupali Ganguly: దేశంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న టీవీ నటి ఎవరు ? ఈ ప్రశ్న పై చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ఆ నటి ఎవరో తెలుసా ? ప్రముఖ నటి ‘రూపాలీ గంగూలీ’. పారితోషికం విషయంలో ఆమె రికార్డులకెక్కారు. ఆమె నటిస్తున్న ‘అనుపమ’ అనే టీవీ డ్రామా సిరీస్ తో ఆమె ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది. మరి ఆమె రోజుకు ఎంత తీసుకుంటుందో తెలుసా ? 44 ఏళ్ల ఈ నటి రోజుకు రూ. 4 లక్షలు డిమాండ్ చేస్తున్నారట. ఫలితంగా టెలివిజన్ రంగంలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న నటిగా ఆమె రికార్డులకెక్కారు.

కాగా, ఈ ‘అనుపమ’ సీరియల్ విషయానికి వస్తే.. భర్త వివాహేతర సంబంధం కారణంగా చితికిపోయిన గృహిణి కథే అనుపమ. స్టార్ ప్లస్ లో ప్రసారమవుతుంది. మొత్తమ్మీద దేశంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న టీవీ నటిగా ‘రూపాలీ గంగూలీ’ ఫుల్ క్రేజ్ సంపాదించింది. నిజానికి ‘రూపాలీ గంగూలీ’ మంచి హీరోయిన్. ఆమె గతంలో అనేక చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. పైగా అనేక బోల్డ్ పాత్రలకు ప్రాణం కూడా పోసింది.

ఒకప్పుడు బుల్లితెరపై సీరియల్స్ కి ఎక్కువ డిమాండ్ ఉండేది. కానీ ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ షోలకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బుల్లితెరపై ఒక నటిగా గొప్ప క్రేజ్ తెచ్చుకోవాడం అంత ఈజీ కాదు. కానీ, వెండితెరపై అందాల ఆరబోతతో ఫాలోయింగ్ తెచ్చుకుంటున్న హీరోయిన్లతో సమానంగా బుల్లితెర పై ‘రూపాలీ గంగూలీ’ ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించింది.

Also Read: ‘పుష్ప’ను మిస్ చేసుకున్న స్టార్లు వీళ్ళే !
ఆమెకు పెరిగిన క్రేజ్ ను బట్టి.. నిర్మాతలు కూడా పారితోషికం విషయంలో ఆమె అడిగినంత ఇస్తున్నారు. వాస్తవానికి బుల్లితెర నటీనటులకు రెమ్యూనరేషన్ చాలా తక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఒక సీరియల్ అద్భుతమైన హిట్ తో ఫుల్ పాపులర్ అయితే.. ఆ సీరియల్ లో నటించే నటీనటులకు కొంచెం ఎక్కువ మొత్తంలో పారితోషికం ఇస్తారు. కానీ, ‘రూపాలీ గంగూలీ’లా ఒక సీరియల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్.. రోజులు 4 లక్షలు తీసుకోవడం రికార్డే.
మొత్తానికి ‘రూపాలీ గంగూలీ’ తన నటనతోనే కాదు, తన రెమ్యునరేషన్ తో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. పైగా సీరియల్స్ లో ఆమె నటన చూసి ఎంతోమంది ఆమెకు అభిమానులుగా మారారు. అయితే, రోజుకు 4 లక్షల రూపాయలు ఇచ్చినా అది తన స్థాయికి తక్కువే అని ఆమె ఫీల్ అవుతుందట.
Also Read: నన్ను రేప్ చేయడం నాకు నచ్చలేదు – మాళవిక
[…] […]
[…] […]