https://oktelugu.com/

హీరో పరిస్థితి ప్రస్తుతం బాగాలేదు !

హీరో శర్వానంద్ పరిస్థితి ప్రస్తుతం అసలు బాగాలేదు. ఏ సినిమా చేసినా బాక్సాఫీస్ వద్ద బకెట్ తన్నేస్తోంది. వరుస ప్లాప్స్ దెబ్బకు కెరీరే ఇబ్బందికరంగా మారింది. ‘శ్రీకారం’తో హిట్ వచ్చి కెరీర్ గాడిలో పడుతుందని భావించినా శర్వా టీమ్.. చివరకి నిరాశ పడాల్సి వచ్చింది. శ్రీకారంకి పోటీగా వచ్చిన ‘జాతిరత్నాలు’ బాక్సాఫీస్ ను షేక్ చేసి దూసుకుపోతుంటే.. జాతి రత్నాలు దెబ్బకు కలెక్షన్స్ ను రాబట్టలేక చేతులు ఎత్తేసింది శ్రీకారం. ఆ రకంగా శర్వానంద్ ఆశలకు గండికొట్టింది. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : March 19, 2021 / 03:27 PM IST
    Follow us on


    హీరో శర్వానంద్ పరిస్థితి ప్రస్తుతం అసలు బాగాలేదు. ఏ సినిమా చేసినా బాక్సాఫీస్ వద్ద బకెట్ తన్నేస్తోంది. వరుస ప్లాప్స్ దెబ్బకు కెరీరే ఇబ్బందికరంగా మారింది. ‘శ్రీకారం’తో హిట్ వచ్చి కెరీర్ గాడిలో పడుతుందని భావించినా శర్వా టీమ్.. చివరకి నిరాశ పడాల్సి వచ్చింది. శ్రీకారంకి పోటీగా వచ్చిన ‘జాతిరత్నాలు’ బాక్సాఫీస్ ను షేక్ చేసి దూసుకుపోతుంటే.. జాతి రత్నాలు దెబ్బకు కలెక్షన్స్ ను రాబట్టలేక చేతులు ఎత్తేసింది శ్రీకారం.

    ఆ రకంగా శర్వానంద్ ఆశలకు గండికొట్టింది. నిజానికి ‘పడి పడి లేచే మనసు’తో తానూ మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కుతానని చాలా హోప్స్ పెట్టుకున్నాడు శర్వా. కానీ ఆ సినిమాతో పాటు ఇప్పుడుశ్రీకారం కూడా ప్లాప్ అయి మొత్తానికి శర్వా ఫ్లాప్ల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. మధ్యలో ‘రణరంగం’, ‘జాను’ ఘోరంగా ప్లాప్ అయ్యాయి. అయితే, ‘శ్రీకారం’ వీటితో పోల్చితే కాస్త బెటర్ అనే టాక్ వచ్చినా.. ఆ స్థాయిలో కలెక్షన్స్ ను మాత్రం సాధించలేకపోయింది. దాంతో ఈ సినిమా కూడా మరో బిగ్గెస్ట్ ప్లాప్ గా నిలిచింది.

    అసలు ‘శ్రీకారం’ సినిమాలో సందేశం బాగుంది అని పేరు వచ్చినా జనం ఎందుకు చూడలేదు. అంటే సినిమాలు చూసే అభిరుచి మారిందా ? లేక కథనం విషయంలోనే ఈ మూవీ తడబడిందా ? కారణం ఏదైనా…రిజల్ట్ బాగాలేదు. శర్వానంద్ ఇప్పుడు తరువాత ఏ సినిమా చేయాలి ? ఎలాంటి జోనర్ లో సినిమా చేయాలి ? అనేది పెద్ద డైలమా. ఏమి చేసైనా నెక్స్ట్ హిట్ కొట్టాలి, లేదంటే.. కెరీర్ ఇక నిలబడటం కష్టమే.

    అన్నట్టు శర్వానంద్ ప్రస్తుతం చేస్తోన్న సినిమాలు మరో మూడు, నాలుగు ఉన్నాయి. వీటిల్లో ఒక తమిళ, తెలుగు చిత్రం ఈ సమ్మర్ లోనే విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే ఆగస్టులో ‘మహాసముద్రం’ రానుంది. వచ్చే ఏడాది ‘ఆడాళ్ళూ మీకు జోహార్లు’ రిలీజ్ అవుతుందట. ఈ రెండు చిత్రాల పై కాస్త అంచనాలు ఉన్నాయి. మరి చూడాలి ఈ సినిమాలలో ఒకటైన హిట్ అవుతుందేమో.