Oke Oka Jeevitham Review: రివ్యూ : ఒకే ఒక జీవితం
నటినటులు: శర్వానంద్, రీతూ వర్మ, అక్కినేని అమల, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, ఆలీ, మధు నందన్ తదితరులు.
డైరెక్టర్: శ్రీ కార్తీక్
నిర్మాతలు: ఎస్ ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు
మ్యూజిక్ డైరెక్టర్: జెక్స్ బిజోయ్
సినిమాటోగ్రఫీ: సుజీత్ సారంగ్
హీరో శర్వానంద్ – అక్కినేని అమల కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. నేడు రిలీజైన ఈ సైంటిఫిక్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూ చూద్దాం.
కథ :
తమ వర్తమానం నచ్చని ఓ ముగ్గురు యువకులు ఆది (శర్వానంద్), శ్రీను (వెన్నెల కిషోర్), మరియు చైతు (ప్రియదర్శి) గతంలోకి వెళ్లి తమ వర్తమానాన్ని, భవిష్యత్తును మార్చుకోవాలని ఆశ పడతారు. అసలు వీళ్లకు గతంలోకి వెళ్ళే ఛాన్స్ ఎలా వస్తోంది ?, వీరి జీవితాల్లోకి సైంటిస్ట్ (నాజర్) ఎలా వస్తాడు ?, ఆది చనిపోయిన తన తల్లి (అమల) ప్రాణాలను ఎలా కాపాడాలనుకుంటడు ?, ఈ క్రమంలో వచ్చే కొన్ని నాటకీయ పరిణామాలు ఏమిటీ ?, ఇంతకీ ఆది, శ్రీను, చైతు అనుకున్నది సాధించారా ? లేదా ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
ఎవరికైనా ఒకే ఒక జీవితం మాత్రమే ఉంటుంది. కానీ జీవితంలో రెండో ఛాన్స్ వస్తే.. ?, గతంలో చేసిన తప్పుల్ని సవరించుకునే ఛాన్స్ వస్తే.. ఈ ఆలోచన మీదే ఈ సినిమా కథ నడుస్తోంది. అసలు ఇలాంటి కథతో కూడా సినిమా చెయ్యొచ్చు అని నమ్మి ఈ చిత్రాన్ని తీసిన శ్రీ కార్తీక్ ను అభినందించాలి. ఈ కమర్షియల్ లోకంలో ఇలాంటి నేపథ్యాన్ని తీసుకుని, ఆ నేపథ్యంలోనే పూర్తి సహజ పాత్రలను రాసుకుని చక్కగా సినిమా తీయడమే దర్శకుడు శ్రీ కార్తీక్ మొదటి సక్సెస్. ముఖ్యంగా ఓకే ఒక జీవితంలో సినిమాలోని ప్రధాన పాత్రల జీవితాలను.. వాళ్ళ ఆలోచనలను వారి కోరికలను ఇలా ప్రతి అంశం చాలా బాగుంది.
అలాగే కీ రోల్ లో కనిపించిన శర్వానంద్ తన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. అమల అక్కినేని నటన కూడా అద్భుతం. ఎమోషన్స్ ను అద్భుతంగా పలికించింది. హీరోయిన్ గా రీతూ వర్మకి పెద్దగా స్కోప్ లేకపోయినా.. ఆమె కూడా ఉన్నంతలో ఆకట్టుకుంది. అయితే, ఈ సినిమాకి ప్రియదర్శి, వెన్నెల కిషోర్ తమ కామెడీ టైమింగ్ తో బాగా నవ్వించారు.
ఇక కథలోని ప్రతి పాత్ర చాలా సహజంగా ఉంటుంది. ప్రతి పాత్ర అర్ధవంతగా సాగుతూ కథను అంతర్లీనంగా ముందుకు నడుపుతుంది. ఇక మిగిలిన నటీనటులు కూడా చాలా బాగా నటించారు. కానీ, ద్వితీయార్థంలో ప్లే బాగా స్లో గా ఉంది. పైగా హీరో హీరోయిన్ల మీద నడిచిన లవ్ ట్రాక్ కూడా బాగాలేదు.
ప్లస్ పాయింట్స్:
నటీనటులు నటన,
కథ కథనం
సినిమాటోగ్రఫీ
ఇంటర్వెల్ బ్యాంగ్
మైనస్ పాయింట్స్
స్లో నేరేషన్
మెలో డ్రామా
తీర్పు :
ఈ ‘ఒకే ఒక జీవితం’ సినిమా ఆకట్టుకుంది. దర్శకుడు శ్రీకార్తీక్ చాలా బాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమాని మిస్ కావద్దు.
రేటింగ్ : 3 /5
Also Read:Queen Elizabeth: క్వీన్ ఎలిజిబెత్ అస్తమయం.. అమల్లోకి ఆపరేషన్ యూనికార్న్.. ఈ ఆపరేషన్ ఏంటి?