Sharwanand New Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీడియం రేంజ్ హీరోగా తనకంటూ ఒక ఐడెంటిటి ని సంపాదించుకున్న నటుడు శర్వానంద్… ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమాతో ప్రేక్షకులందరిని మెప్పించాడు. అలాంటి శర్వానంద్ గత కొద్ది రోజుల నుంచి ఆశించిన మేరకు సక్సెస్ ను సాధించకపోవడంతో ఈ సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు… ఇక ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని సూపర్ సక్సెస్ ని సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో సంక్రాంతికి రిలీజ్ చేసిన సినిమాలు అతనికి ఎక్కువగా కలిసి వచ్చాయి. ఇంతకుముందు ‘శతమానం భవతి’ సినిమాతో 2017 వ సంవత్సరంలో భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్న శర్వానంద్ అప్పట్నుంచి ఇప్పటివరకు పెద్దగా సక్సెస్ అయితే సాధించలేకపోయాడు. దాంతో మరోసారి సంక్రాంతి హీరోగా తన సత్తా చాటుకోవడంతో రాబోయే సినిమాలను సైతం సంక్రాంతి బరిలో నిలపాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన బైకర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మరో రెండు నెలల్లో రిలీజ్ అవ్వబోతుంది.
ఇక ఈ సినిమాతో పాటుగా సంపత్ నంది దర్శకత్వంలో ‘భోగి’ అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా సైతం విల్దినంత తొందర్లోనే రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతుంది… శ్రీను వైట్ల డైరెక్షన్లో చేయబోయే సినిమాని 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నంలో శర్వానంద్ ఉన్నాడు.
ఈ సినిమా 2027 సంక్రాంతి బరిలో నిలుస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ అప్పుడు రిలీజ్ అయి సూపర్ సక్సెస్ ని సాధిస్తే ఇక శర్వానంద్ సైతం సంక్రాంతి హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకుంటాడా? తను అనుకున్న సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? అనేది తెలియాల్సి ఉంది.
శర్వానంద్ సినిమాలు చూడడానికి ఈ మధ్యకాలంలోనే ఎక్కువగా ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి ఈ సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి సినిమా ఇచ్చిన హిట్టుతో మరోసారి తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు…