Sharwanand: మన టాలీవుడ్ లో ఒకప్పుడు శర్వానంద్ ని భవిష్యత్తులో చాలా పెద్ద రేంజ్ కి వెళ్లాడని అందరూ అనుకునేవారు. ‘శతమానం భవతి’ మూవీ చిరంజీవి , బాలయ్య సినిమాల మధ్యలో వచ్చి సెన్సేషనల్ హిట్ అవ్వడం తో, ఇక శర్వానంద్ టైం మొదలైంది, రాబోయే రోజుల్లో స్టార్ లీగ్ లోకి వెళ్లాడని అంతా అనుకున్నారు. కానీ ఎవరి దిష్టి తగిలిందో ఏమో తెలియదు కానీ, శర్వానంద్ కి మొన్నటి వరకు ‘శతమానం భవతి’ నే చివరి కమర్షియల్ హిట్. ఆ తర్వాత మారుతీ తో కలిసి చేసిన ‘మహానుభావుడు’ అనే చిత్రం కమర్షియల్ గా పెద్ద రేంజ్ రేంజ్ లో ఆడలేదు కానీ, పర్వాలేదు అనే రేంజ్ లో ఆడింది. అప్పటి నుండి ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం ముందు వరకు కూడా ఫ్లాపులు, డిజాస్టర్ ఫ్లాపులే శర్వానంద్ కి ఎదురు అవుతూ వచ్చాయి.
ఇప్పుడు ‘నారీ నారీ నడుమ మురారి’ తో భారీ కమర్షియల్ సక్సెస్ ని అందుకోవడం తో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. ఇక పై చేసే ప్రతీ సినిమా స్క్రిప్ట్ మినిమం గ్యారంటీ రేంజ్ లో ఉండేలా చూస్తున్నాడు. గత ఏడాది చివర్లో ఈయన హీరో గా నటించిన ‘బైకర్’ మూవీ టీజర్ విడుదలైంది. ఈ టీజర్ కి ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాపై మార్కెట్ లో మంచి పాజిటివ్ బజ్ ఉంది. ఇకపోతే రీసెంట్ గానే శర్వానంద్ నిర్మాత అనిల్ సుంకర, డైరెక్టర్ రామ్ అబ్బూరి లతో కలిసి ఒక ఇంటర్వ్యూ చేసాడు. ఈ ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడిన మాటలు కొన్ని ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇవి విన్న తర్వాత అయ్యో, పాపం శర్వా అని అనిపించక తప్పదు.
ఆయన మాట్లాడుతూ ‘నేను, నిర్మాత అనిల్ గారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో కేవలం మాకు మాత్రమే తెలుసు . మేమంతా ఇప్పటికీ కొన్ని విషయాల్లో ఒకరకమైన బాధతో ఉన్నాము. ఇప్పుడు చెప్పొచో, లేదో తెలియదు కానీ, నాకు సరైన కమర్షియల్ హిట్ వచ్చి 7 ఏళ్ళు అవుతోంది. నిర్మాత అనిల్ గారికి కూడా గత రెండు, మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఒకరికి ఒకరం సహాయం చేసుకునే పరిస్థితిలో కూడా లేము. గతం లో నేను చాలా మంది నిర్మాతలకు సహాయం చేసాను. కానీ వాళ్ళు మాత్రం నాకు తిరిగి వెన్నుపోటు పొడిచారు. నేను సహాయం చేసినప్పుడు శర్వానంద్ మనోడే కదా అని వాళ్ళు అనుకోలేదు. అలాంటి వాళ్ళని నమ్మాలంటే భయం వేస్తోంది. అలా వారి వాళ్ళ నాకు తెలియకుండానే తిక్కోలోడిని అయిపోయాను. కానీ మా నిర్మాత అనిల్ ఫ్లాప్స్ లో ఉన్న నాతో ఇంత గొప్ప సినిమా తీసాడు. ఆయన నాకు నా సొంత అన్న కంటే ఎక్కువ’ అంటూ శర్వానంద్ చెప్పుకొచ్చాడు.