Anil Ravipudi And Pawan Kalyan: ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత అనిల్ రావిపూడి(Anil Ravipudi) తన 10వ చిత్రానికి కథ ఫిక్స్ చేసుకున్నాడు, ఒక వెరైటీ టైటిల్ ని కూడా అనుకున్నాడట, ఈ విషయాన్ని రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. కానీ హీరో ఎవరు అనే విషయం పై ఆయన ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. అయితే చాలా మంది అనిల్ రావిపూడి తదుపరి చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉంటుంది అంటూ నిన్నటి నుండి సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. వరుస హిట్స్ తో ఫ్యామిలీ ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి కి, పవన్ కళ్యాణ్ లాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో దొరికితే బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలే, ఈసారి 500 కోట్ల టార్గెట్ అంటూ ఇప్పటి నుండే లెక్కలు వేసుకోవడం మొదలు పెట్టారు.
అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ తో సినిమా పై క్లారిటీ ఇచ్చాడు అనిల్ రావిపూడి. ఆయన మాట్లాడుతూ ‘పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలనీ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాను, చాలా ఉత్సాహం గా ఉన్నాను. కానీ ఇప్పుడు ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఫుల్ బిజీ గా ఉన్నాడు. రెగ్యులర్ గా సినిమాలు చేసే స్టార్ కాదు కదా. చూడాలి, రాబోయే రోజుల్లో మా కాంబినేషన్ ఫిక్స్ అయితే సంతోషం. కానీ ఇప్పటి వరకు అయితే పవన్ కళ్యాణ్ గారిని నేను నేరుగా కలిసి ఎలాంటి కథ వినిపించలేదు, ఆ ప్లాన్ లో కూడా లేదు, రాబోయే రోజుల్లో ఏమైనా జరుగుతుందేమో చూడాలి’ అంటూ చెప్పుకొచ్చాడు.
అంటే అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని పవన్ కళ్యాణ్ తో చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు. కానీ ఇప్పటి వరకు ఆయనతో నేరుగా ఎలాంటి చర్చలు జరగలేదని అంటున్నాడు. నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాన్ని వీక్షించాడు. ఈ సినిమా అద్భుతంగా ఉందంటూ ట్విట్టర్ లో మూవీ టీం ని ట్యాగ్ చేసి అభినందించాడు కూడా. అంటే కచ్చితంగా అనిల్ రావిపూడి తో ఆయన నిన్న రాత్రి ఫోన్ కాల్ సంభాషణ జరిపే ఉంటాడు. కాబట్టి రాబోయే రోజుల్లో వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి, రావాలని కూడా అభిమానులు కోరుకుంటున్నారు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.