Sharwanand Biker pre-release business: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న హీరో శర్వానంద్(Sharwanand) ఇప్పుడు ఒకే ఒక్క సూపర్ హిట్ తో తన మార్కెట్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్లిపోయాడు. ఈ సంక్రాంతికి విడుదలైన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై శర్వానంద్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడం వల్ల ఆయనపై నిర్మాతల్లో , బయ్యర్స్ లో ఒక బలమైన నమ్మకం ఏర్పడింది. సరైన సినిమా తో వస్తే శర్వానంద్ మూవీస్ కి జనాలు ఇప్పటికీ క్యూ కడుతారు అని గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఆయన తదుపరి చిత్రం ‘బైకర్'(Biker Movie) కి క్రేజీ బిజినెస్ జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి దిల్ రాజు 24 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కాసేపు పక్కన పెడితే నాన్ థియేట్రికల్ రైట్స్ కి కూడా క్రేజీ డిమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని అన్ని భాషలకు కలిపి 27 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చినట్టు సమాచారం. అంతే కాకుండా ఆడియో రైట్స్ ని 8 కోట్ల రూపాయలకు పలుకుతుందట. ఇంకా డబ్బింగ్ రైట్స్ , సాటిలైట్ రైట్స్ అమ్ముడుపోవాల్సి ఉంది. ప్రస్తుతానికి ఇప్పటి వరకు ఈ చిత్రానికి థియేట్రికల్ + ఓటీటీ + ఆడియో రైట్స్ కలిపి 59 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. మిగిలిన రైట్స్ కూడా అమ్ముడుపోతే 80 కోట్ల రూపాయిల వరకు ఈ సినిమా బిజినెస్ చేరే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రానికి ముందు శర్వానంద్ సినిమా కి బిజినెస్ జరగడమే కష్టం గా ఉండేది.
కానీ ఇప్పుడు ఏకంగా 80 కోట్ల రూపాయిల రేంజ్ లో బిజినెస్ జరుగుతోంది . ఇది సాధారణమైన విషయం కాదు. ఈ సినిమా కూడా హిట్ అయితే శర్వానంద్ రేంజ్ ఇంకా పెద్దగా వెళ్లే అవకాశం ఉంది. ఇకపోతే ఈ చిత్రం లో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్ర పోషించగా , మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది. అదే విధంగా ఈ సినిమాలో శర్వానంద్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాని టాక్. ఆయన తండ్రి క్యారెక్టర్ ని కూడా శర్వానంద్ నే చేస్తున్నాడట. ఏప్రిల్ 3 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమా శర్వానంద్ కెరీర్ ని ఎలా మలుపు తిప్పుతుందో చూడాలి. పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.