Sharwanand Biker movie: డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న నటుడు శర్వానంద్…కెరియర్ స్టార్టింగ్ లో వరుస సక్సెస్ లను సాధించిన ఆయన ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలతో ఏమాత్రం తన సత్తా చూపించలేకపోతున్నాడు. ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాతో ఈ సంవత్సరం ఇప్పటికే సక్సెస్ ని సాధించిన ఆయన ఇప్పుడు బైకర్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రేపు రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా విషయంలో ఆయన టీమ్ చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు… వీళ్లు అనుకుంటున్నట్టుగా ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది. తద్వారా ఈ సినిమాతో వాళ్లు ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ చేసుకోబోతున్నారనే విషయం తెలియాల్సి ఉంది… ఇక ఈ సినిమా ఈ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది గంటలపాటు వేసి చూడాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఈ సినిమా మీద భారీ బడ్జెట్ అయితే పెట్టారు.
రికవరీ అవ్వాలంటే మాత్రం పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించినట్టయితే మాత్రం ఆయన ముందుకు టాప్ హీరోగా ముందుకు దూసుకెళ్లే అవకాశాలైతే ఉన్నాయి. తన తోటి హీరోలందరు స్టార్ హీరోలుగా వెలుగొందుతుంటే శర్వానంద్ మాత్రం ఇంకా ఒక సక్సెస్ ని సాధించడానికి ఇబ్బంది పడుతుండడం చూస్తున్నా అతని అభిమానులు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: పవన్ కళ్యాణ్ చేసిన ఆ రెండు సినిమాలు అతన్ని ప్రమాదంలో నెట్టేశాయిగా…
ఇక ‘బైకర్’ సినిమా కొత్తగా ఉండబోతుందంటూ వార్తలైతే వస్తున్నాయి… ఇప్పటివరకు ఎవ్వరు ఊహించనటువంటి రీతిలో ఈ సినిమాని టాప్ లెవెల్లో నిలిపాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇప్పటికైనా ఈ సినిమాతో శర్వానంద్ భారీ విజయాన్ని సాధిస్తే తనదైన రీతిలో సత్తా చాటుకున్న వాడవుతాడు.
లేకపోతే మాత్రం మరోసారి ఆయన పూర్తిగా డీలాపడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు… కొత్త దర్శకుడు ఈ సినిమాని ఎలా హ్యాండిల్ చేశాడు రాజశేఖర్ క్యారెక్టర్ కూడా ఈ సినిమాకి ప్లస్ గా మారబోతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది గంటల పాటు వేచి చూడాల్సిందే…
