Sharwanand Biker Movie Promotion: యూవీ క్రియేషన్స్ బ్యానర్ రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) సోదరుడు ప్రబోధ్, మరియు అతని స్నేహితులది అనే సంగతి అందరికీ తెలిసిందే. ‘మిర్చి’ సినిమాతో ఈ బ్యానర్ మొదలైంది. ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వడం, ఆ తర్వాత ఎన్నో భారీ ప్రాజెక్ట్స్ ని నిర్మించి టాలీవుడ్ లోనే మోస్ట్ ప్రెస్టీజియస్ బ్యానర్స్ లో ఒకటిగా నిలబడడం వంటివి మన కళ్లారా చూశాము. అయితే అప్పట్లో ప్రభాస్ ఈ బ్యానర్ నుండి వచ్చే సినిమాలపై ప్రత్యేకమైన ఫోకస్ పెట్టేవాడు కాదు. అంతర్గతంగా ఆయన అన్ని విధాలుగా సపోర్ట్ చేసేవాడు కానీ, బయటకు కనిపించేలా మాత్రం ఎలాంటి సపోర్టు చెయ్యలేదు. కానీ ఈమధ్య కాలం లో మాత్రం తన బ్రాండ్ ఇమేజ్ ని యూవీ క్రియేషన్స్ ఎదుగుదలకు వాడుతున్నాడు ప్రభాస్. ఎందుకంటే ఆ సంస్థ ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో ఉంది.
రీసెంట్ గానే ఈ సంస్థ నిర్మించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదల తర్వాత మూవీ టీం తో ప్రభాస్ చేసిన ఒక ఇంటర్వ్యూ బాగా పేలింది. ఆ ఇంటర్వ్యూ తర్వాత సినిమా కలెక్షన్స్ కూడా భారీ రేంజ్ లో పెరిగాయి. ఇప్పుడు ఆయన బ్రాండ్ ఇమేజ్ ని మరోసారి యూ క్రియేషన్స్ బ్యానర్ కి ఉపయోగిస్తున్నాడు. లేటెస్ట్ గా ఈ బ్యానర్ లో శర్వానంద్ హీరో గా ‘బైకర్’ అనే చిత్రం తెరకెక్కింది. సీనియర్ హీరో రాజశేఖర్ ఇందులో కీలక పాత్ర పోషించాడు. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల అవ్వగా దానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం కచ్చితంగా క్లిక్ అవుతుందని అంతా అనుకున్నారు.
అయితే ఈ సినిమా ప్రొమోషన్స్ ప్రభాస్ మరోసారి రంగం లోకి దిగాల్సి వచ్చింది. గతం లో ప్రభాస్ శర్వానంద్ గురించి మాట్లాడుతూ ‘శర్వా మా ఇంటి హీరో’ అన్న మాటలను బ్యాక్ గ్రౌండ్ లో ప్లే చేస్తూ ఉండగా, ప్రభాస్ ఎంట్రీ స్టైల్ గా జరుగుతుంది. మిర్చి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్లే అవుతుండగా, ప్రభాస్ స్టైల్ గా బైక్ ని తీస్తూ ‘ట్రైలర్ ని చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్’ అంటూ మిర్చి లో చెప్పే డైలాగ్ ని రీ క్రియేట్ చేస్తాడు. ప్రభాస్ నుండి ఇలాంటి ప్రమోషనల్ కంటెంట్ వస్తుందని అభిమానులు అసలు ఊహించలేదు. నిజంగా వాళ్లకు ఇది ఊహించని సప్రైజ్ అనే చెప్పాలి , సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తున్న ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.
#Prabhas #BikeronApril3rd pic.twitter.com/Bs23tMKR0g
— T2BLive.COM (@T2BLive) March 31, 2026