Site icon OkTelugu

Biker Movie First Week Collections: ‘బైకర్’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇక బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం అసాధ్యం..

Biker Movie First Week Collections

Biker Movie First Week Collections

Biker Movie First Week Collections: ఈ సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకొని సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన శర్వానంద్(Actor Sharwanand), ఇప్పుడు ‘బైకర్'(Biker Movie) చిత్రంతో మరోసారి మన అందరినీ అలరించడానికి ముందుకొచ్చాడు. ఈ సినిమాకు మొదటి రోజు మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ ఆ టాక్ కి తగ్గ వసూళ్లు మాత్రం రావడం లేదు. ఈ చిత్రానికి చాలా బడ్జెట్ ఖర్చు చేశారు. అందులో సగభాగం నాన్ థియేట్రికల్ రైట్స్ లో రీకవర్ అవ్వగా, మిగిలిన సగభాగం థియేటర్స్ నుండి రీ కవర్ అవ్వాలి. విడుదలకు ముందు 22 కోట్ల రూపాయిల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రంగం లోకి దిగిన ఈ చిత్రం , వారం రోజుల్లో ఎంత వసూళ్లను రాబట్టింది ?, బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఎంత షేర్ వసూళ్లను రాబట్టాలి అనేది వివరంగా చూద్దాం.

ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి మొదటి వారం నైజాం ప్రాంతం నుండి 3 కోట్ల 90 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ ప్రాంతం లో చాలా మంచి నెంబర్ ని రాబట్టింది అనే చెప్పొచ్చు. అదే విధంగా సీడెడ్ నుండి 61 లక్షల రూపాయల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చీటీనికి ఆంధ్ర ప్రదేశ్ నుండి 2 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాబట్టింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 12 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 6 కోట్ల 71 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 97 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి, ఓవర్సీస్ నుండి కేవలం కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి.

ఇదే అందరినీ సర్ప్రైజ్ కి గురి చేస్తున్న విషయం. సాధారణంగా ఇలాంటి సినిమాలకు ఓవర్సీస్ నుండి భారీ వసూళ్లు నమోదు అవుతుంటాయి. కానీ ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా వసూళ్లు నమోదు అవ్వడం లేదు. ఓవరాల్ గా ఈ చిత్రానికి వారం రోజుల్లో వరల్డ్ వైడ్ గా 8 కోట్ల 82 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మరో 13 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. ఇది దాదాపుగా అసాధ్యం అనే చెప్పొచ్చు. చూడాలి మరి ఫుల్ రన్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.

Exit mobile version