Mona Lisa : ఉత్తరప్రదేశ్ లో ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాతో ఒక్కసారిగా చాలామంది ఫేమస్ అయిపోయారు. ముఖ్యంగా వీళ్ళలో మోనాలిసా బోన్స్లే చాలా పాపులర్ అయ్యింది. తన అందంతో అందరిని కట్టిపడేసింది మోనాలిసా.తేనే కళ్ళు,అమాయకపు చూపులు ఉన్న మోనాలిసా ప్రస్తుతం సోషల్ మీడియా లో సెన్సేషన్ గా మారిపోయింది. పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకోవడానికి మహా కుంభమేళాకు తన కుటుంబంతో వచ్చిన ఈ మధ్యప్రదేశ్ అమ్మాయి ఊహించని విధంగా ప్రస్తుతం పాపులర్ అయిపోయింది. సినిమాల్లో నటించేందుకు కూడా ప్రస్తుతం మోనాలిసా సిద్ధమైంది. మహా కుంభమేళా కారణంగా చాలామంది ఓవర్ నైట్ లో ఫేమస్ అయిపోయారు. వీళ్ళలో మోనాలిసా కూడా ఒకటి. మోనాలిసా మధ్యప్రదేశ్ ఇండోర్లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన అమ్మాయి. ఈమె తన జీవనోపాధి కోసం తన కుటుంబంతో కలిసి మహా కుంభమేళాకు వచ్చింది. తరతరాలుగా వీళ్లు మహాకుంభమేళాలో పూసల దండాలు,రుద్రాక్షలు అమ్ముతుంటారు.అయితే ఇలా పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముతున్న సమయంలో కొందరు యూట్యూబర్ల కంట్లో పడింది. అంతే ఈ క్రమంలో క్షణాల్లో మోనాలిసా ఫోటోలు మరియు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిపోయాయి. దాంతో దేశవ్యాప్తంగా ఎక్కడ చూసిన మోనాలిసా పేరు మారుమోగిపోయింది. ఈమె ఎంతలా ఫేమస్ అయ్యింది అంటే వెతుక్కుంటూ మరి ఓ బాలీవుడ్ దర్శకుడు ఆమె ఇంటికి వెళ్ళాడు. మోనాలిసా తో సినిమా చేసేందుకు దర్శకుడు రెడీ అయిపోయాడు. బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా తన రాబోయే సినిమా ది డైరీ ఆఫ్ మణిపూర్ లో మోనాలిసా కు నటించేందుకు అవకాశం ఇచ్చాడు. మోనాలిసా కు యాక్టింగ్ రాకపోయిన పర్లేదు యాక్టింగ్ నేర్పించి మరి సినిమాలో తీసుకుంటాం అని సనోజ్ మిశ్రా తెలిపారు.
సనోజ్ మిశ్రా ఆమె ఇంటికి వెళ్లి అగ్రిమెంట్ చేసుకున్నట్టు సమాచారం. మోనాలిసాకు సినిమా ఆఫర్ రావడంతో ఆమెతోపాటు ఆమె కుటుంబ సభ్యులకు కూడా తెగ సంబరపడిపోతున్నారు. మోనాలిసా సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఆమె పెట్టిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మోనాలిసా అల్లు అర్జున్ పుష్ప2 మూవీ పోస్టర్తో దిగిన ఒక ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. చాలా కొద్ది క్షణాల్లోనే ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
ఈ ఫోటో షేర్ చేస్తూ మోనాలిసా ఈరోజు పోస్టర్తో బయట ఉన్న, రేపటి రోజున థియేటర్లలో కనిపిస్తా, త్వరలోనే ముంబైలో కలుద్దాం. అల్లు అర్జున్ పుష్ప 2 అంటూ తన పోస్ట్ కు క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్ట్ చూసిన అల్లు అర్జున్ అభిమానులు ఆమెకు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. చాలామంది సోషల్ మీడియా ద్వారా మోనాలిసా కు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. ఇలా మధ్య ప్రదేశ్ కు చెందిన అమ్మాయి మహాకుంభమేళా పుణ్యమా అంటూ ఓవర్ నైట్ లో ఫేమస్ అయిపోయి సినిమాలలో నటించే ఛాన్స్ అందుకుంది
आज पोस्टर के बहार कल अंदर होंगे यही समय का चक्र है
जल्दी ही मुंबई में मिलेंगेअल्लू अर्जुन पुष्पा -2 pic.twitter.com/zwEpb8x4Dp
— Monalisa Bhosle (@MonalisaIndb) February 3, 2025