Prashanth Varma: సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు ఒక్క సక్సెస్ కోసం విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారు…ఇలాంటి క్రమంలోనే ప్రశాంత్ వర్మ లాంటి దర్శకుడు హనుమాన్ సినిమాతో భారీ విజయాన్ని సాధించాడు. ఇక ప్రొడ్యూసర్ ప్రశాంత్ వర్మ మీద కొన్ని కామెంట్స్ చేస్తూ ఛాంబర్ లో కంప్లైంట్ చేశాడు. ఇక ఇప్పుడు దానికి రిటర్న్ గా ప్రశాంత్ వర్మ ఒక నోట్ రిలీజ్ చేశాడు. ప్రశాంత్ వర్మ నిరంజన్ రెడ్డిని కాదని ఇతర బ్యానర్లలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. నిరంజన్ రెడ్డి మాత్రం నా బ్యానర్లో సినిమాలు చేస్తానని చెప్పి నా దగ్గర అడ్వాన్సులు తీసుకొని సినిమాలు చేయడం లేదంటూ కామెంట్స్ అంటూ చేస్తున్నాడు. ఇక మొత్తానికైతే వీళ్ళిద్దరిలో తప్పు ఎవరిది అనే విషయం మీద సరైన క్లారిటి లేదు. కానీ మొత్తానికైతే వీళ్లు ప్రస్తుతం ఒకరి మీద ఒకరు కంప్లైంట్లైతే చేసుకుంటున్నారు. మరి దీనికి చాంబర్ నుంచి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది…
ఇప్పటివరకు ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమా తర్వాత మరొక సినిమా స్టార్ట్ చేయలేదు. ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేస్తూ కొన్ని సినిమాలను తన బ్యానర్ నుంచి ప్రొడ్యూస్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. దాంతో పాటుగా ఇతరు దర్శకులకు కూడా తన కథలను అందించి భారీ డబ్బులు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
నిజానికి ప్రశాంత్ వర్మ ఇప్పుడు ప్రొడక్షన్ హౌజ్ పెట్టడం దేనికి అంటూ మరి కొంతమంది విమర్శిస్తున్నారు…మంచి సినిమాలు చేసి స్టార్ హీరోలతో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తే బాగుంటుంది. కానీ ఇలా ప్రొడక్షన్ హౌజ్ లాంటి పంచాయతీలు పెట్టుకుంటే అవి సక్రమంగా సాగవని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికైతే బాలయ్య బాబు కొడుకు అయిన మోక్షజ్ఞ సినిమా చేస్తానని కమిట్ అయిన ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఆ సినిమాని అటకెక్కించినట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం బాలయ్య ప్రశాంత్ వర్మ మీద సీరియస్ గా ఉన్నాడు… మరి మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అనేది ఒక మిస్టరీగా మారిపోయింది. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ మీద ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది కోపంతో ఉన్నారు. మరి వాళ్ళందరినీ తట్టుకొని ప్రశాంత్ వర్మ నిలబడతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…
హనుమాన్ 295 కోట్లు collect చేసింది… నా వాటా నాకు రావాలి
Prasanth Varma Demands#HanuMan pic.twitter.com/Xj8XViIrTU
— M9 NEWS (@M9News_) November 2, 2025