‘రష్మిక’కు అతనితో సంబంధం ఏమిటి ?

సౌత్ లో ఈ మధ్య కాలంలో స్పీడ్ గా ఎదిగిన హీరోయిన్ ఎవరు అంటే.. ముందుగా ముచ్చటించుకునే పేరు ‘రష్మిక మండన్నా’ది. ఆమె గొప్ప అందగత్తె కాదు, పోనీ మహానటి అనిపించుకునే లక్షణాలు కూడా ఆమెలో లేవు. సన్నగా పీలగా ఉండే రష్మికకు గట్టిగా కండ కూడా లేదు. పోనీ కుర్రాళ్ళను ఆకట్టుకునే ఫిజిక్ కూడా ఈ బ్యూటీలో లేదు. అయినా అదృష్టం కలిసి వచ్చి టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా దూసుకుపోయింది. తెలుగులో స్టార్ […]

Written By: admin, Updated On : July 25, 2021 3:43 pm
Follow us on

సౌత్ లో ఈ మధ్య కాలంలో స్పీడ్ గా ఎదిగిన హీరోయిన్ ఎవరు అంటే.. ముందుగా ముచ్చటించుకునే పేరు ‘రష్మిక మండన్నా’ది. ఆమె గొప్ప అందగత్తె కాదు, పోనీ మహానటి అనిపించుకునే లక్షణాలు కూడా ఆమెలో లేవు. సన్నగా పీలగా ఉండే రష్మికకు గట్టిగా కండ కూడా లేదు. పోనీ కుర్రాళ్ళను ఆకట్టుకునే ఫిజిక్ కూడా ఈ బ్యూటీలో లేదు.

అయినా అదృష్టం కలిసి వచ్చి టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా దూసుకుపోయింది. తెలుగులో స్టార్ హీరోల సరసన ఫుల్ క్రేజీ ప్రాజెక్టులు చేస్తోన్న రష్మికకు, ఒక్కసారిగా బాలీవుడ్ నుంచి ఆఫర్లు రావడం మొదలుపెట్టాయి. నిజానికి అందరు హీరోయిన్లలానే రష్మిక కూడా బాలీవుడ్ లో నటించాలని ఆశ పడింది.

కానీ ఇంత త్వరగా ఆమెకు హిందీ ఛాన్స్ లు వస్తాయని ఎవరూ ఊహించలేదు. వాస్తవానికి హిందీ ఛాన్స్ లు కోసం ఎప్పటి నుండో కాజల్, శృతి హాసన్, తమన్నా, రకుల్ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్లంతా ఒకటి రెండు అవకాశాలు తెచ్చుకుని ఏదో బండి లాక్కొస్తున్నారు. కానీ, రష్మిక అలా కాదు. హిందీ అవకాశాల కోసం ఆమె ఎన్నడూ ప్రయత్నించలేదు.

కానీ, హిందీలో బిజీ హీరోయిన్ గా మారపోయింది రష్మిక, పైగా హిందీలో ఒక్క హిట్ కూడా రాకముందే సక్సెస్ అయింది. ప్రస్తుతం మిషన్ మజ్నుతో పాటు అమితాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలు చేస్తోంది. ఇంకా మరో రెండు సినిమాల్లో కూడా నటిస్తోంది. అయితే రష్మికకు బాలీవుడ్ లో ఛాన్స్ లు రావడానికి ముఖ్య కారణం దర్శకుడు శాంతను అట.

అవును, అతనే మిషన్ మజ్నులో రష్మికకు హీరోయిన్ పాత్ర ఇప్పించాడని , అలాగే అమితాబ్ సినిమాలో కూడా అతనే ఛాన్స్ ఇప్పించాడని తెలుస్తోంది. మరి అతనికి రష్మికకు సంబంధం ఏమిటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది.