Shanmukh-Deepti Sunayana : యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్, వీడియో సాంగ్స్ చేస్తూ మంచి పేరు సంపాదించాడు. బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొన్న షణ్ముఖ్ సత్తా చాటాడు. అప్పట్లో అతనికి ఉన్న క్రేజ్ చూసి సీజన్ 5 విన్నర్ షణ్ముఖ్ అని అంతా భావించారు. కానీ కొన్ని కారణాల వలన రన్నరప్ తో సరిపెట్టుకున్నాడు. కాగా బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ ప్రవర్తించిన తీరు చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది.
అప్పటికే దీప్తి సునైనతో పీకల్లోతు ప్రేమలో ఉన్న షణ్ముఖ్, సిరి తో సన్నిహితంగా ఉండటం తో ఫ్యాన్స్ విమర్శలు చేశారు. షణ్ముఖ్ హౌస్ నుంచి బయటకు వచ్చాక, తమ సుదీర్ఘ ప్రేమకథకు దీప్తి సునైన ముగింపు పలికింది. అతనికి బ్రేకప్ చెప్పింది. బిగ్ బాస్ హౌస్ లో సిరి హన్మంత్ తో సన్నిహితంగా ఉన్న కారణంగానే దీప్తి సునైన విడిపోయిందనే వాదన ఉంది. ప్రస్తుతం ఎవరి లైఫ్ లో వారు బిజీగా ఉన్నారు. అయితే ఈ జంట విడిపోయినప్పుడు వారి కంటే వాళ్ళ అభిమానులు ఎక్కువ బాధ పడ్డారు.
దీప్తి సునైనా 2022 లో షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పింది. ఈ జంట విడిపోయి చాలా కాలం అవుతున్నప్పటికీ వారి ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికీ మర్చిపోవడం లేదు. తరచుగా ఈ విషయాన్ని తెర పైకి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా షణ్ముఖ్ జస్వంత్ కి ఓ అభిమాని నుంచి ప్రశ్న ఎదరైంది. దానికి అతను ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు. బ్రేకప్ అయినా ఇంత హ్యాపీ గా ఎలా ఉంటున్నావు చెప్పు బ్రో అని, అభిమాని అడిగాడు. దీనికి షణ్ముఖ్ చాలా కూల్ గా బదులిచ్చాడు.
పవన్ కళ్యాణ్ సినిమాలోని ఓ పాట లిరిక్స్ ను సమాధానంగా చెప్పాడు. ‘ కోరుకున్నది చేయి దాటిపోతే వెళ్ళిపోనీలే .. బాధపడటం బెంగపడిపోవడం మనకి రాదసలే ‘ అంటూ ఆన్సర్ ఇచ్చాడు. షణ్ముఖ్ సమాధానం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. చూస్తుంటే… దీప్తి వదిలేసినా నాకు బాధలేదు. నేను హ్యాపీ అని చెప్పినట్లుగా ఉంది. గత ఏడాది అయ్యయ్యో సాంగ్ లో యూట్యూబ్ కోస్టార్ ఫణి పూజితతో రొమాన్స్ చేశాడు షణ్ముఖ్.