Shanmukh Jaswanth BMW Car: యూట్యూబర్ అండ్ బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ రేంజ్ ఏమిటో ఇప్పుడు అర్థమైంది. మనోడు ఏకంగా లగ్జరీ బిఎండబ్ల్యు కారు దక్కించుకున్నాడు. ఇక తాను కొన్న కొత్త కారు పై కూర్చొని ఫోజులిచ్చాడు. విజయదశమి నాడు కుటుంబ సభ్యులతో పాటు షో రూమ్ కి వెళ్లిన షణ్ముఖ్ బ్లూ కలర్ కారు కొనుగోలు చేశారు. అక్కడే కేక్ కట్ చేసి సెలెబ్రేట్ చేసుకున్నాడు. ‘ఇదంతా కలలా ఉంది. పేరెంట్స్ తర్వాత నన్ను ఈ పొజిషన్ లో చూడాలనుకుంది మీరే(ఫ్యాన్స్). కేవలం మీరే ఇంకెవరు కాదు. ఇది మన కారు. ఎప్పుడైనా కనిపిస్తే లిఫ్ట్ అడగండి, తప్పకుండా ఇస్తాను’ అని కామెంట్ పోస్ట్ చేశాడు.

ఇక షణ్ముఖ్ కొన్న బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాండ్ కోప్ ధర అక్షరాల రూ. 51 లక్షలు వరకూ ఉంది. ఓ యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించిన షణ్ముఖ్ బీఎండబ్ల్యూ కారు కొనే రేంజ్ కి ఎదగడం నిజంగా గొప్ప విషయం. నటనపై ఆసక్తితో షణ్ముఖ్ యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్, సాంగ్స్ చేయడం ప్రారంభించాడు. అతని వీడియోలకు మంచి రెస్పాన్స్ దక్కడంతో షణ్ముఖ్ యూట్యూబ్ స్టార్ గా ఎదిగాడు. సోషల్ మీడియా స్టార్ హోదాలో బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొనే ఛాన్స్ దక్కించుకున్నాడు.
Also Read: Adipurush Poster Copied: కాపీ కొడితే కొట్టారు కనీసం క్రెడిట్ ఇవ్వరా… మరో వివాదంలో ఆదిపురుష్!
బిగ్ బాస్ సీజన్ 5 రన్నర్ గా షణ్ముఖ్ నిలిచాడు. ఫైనల్ లో అతడు కంటెస్టెంట్ సన్నీతో పోటీపడ్డారు. సన్నీ టైటిల్ విన్నర్ కాగా, షణ్ముఖ్ రెండో స్థానంతో రన్నర్ గా నిలిచాడు. బిగ్ బాస్ షో ఆయన పాపులారిటీ మరింత పెంచింది. ప్రస్తుతం షణ్ముఖ్ రేంజ్ పెరిగింది. ఈ మధ్య ఆహాలో ఓ సిరీస్ చేశాడు. అలాగే తనకు ఫేమ్ తెచ్చిపెట్టిన యూట్యూబ్ వీడియోలు కొనసాగిస్తున్నాడు.

కాగా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకొచ్చాక షణ్ముఖ్ లవర్ దీప్తి సునయన అతనికి బ్రేకప్ చెప్పింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా దీప్తి తెలియజేసింది. షణ్ముఖ్ కి దీప్తి దూరం కావడానికి సిరీనే కారణమన్న వాదన వినిపించింది. హౌస్ లో ఫ్రెండ్షిప్ పేరుతో సిరి-షణ్ముఖ్ నాన్ స్టాప్ రొమాన్స్ చేశారు. ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయారు. లవర్స్ మాదిరి కొట్టుకుంటూ కలిసిపోతూ కనిపించారు. సిరితో రిలేషన్ నచ్చకే షణ్ముఖ్ ని దీప్తి వదిలేసినట్లు సమాచారం.
Also Read:Godfather Collections: ‘గాడ్ ఫాదర్’ 2 వ రోజు వసూళ్లు..చరిత్ర తిరగరాసిన మెగాస్టార్
View this post on Instagram
[…] Also Read: Shanmukh Jaswanth BMW Car: అమ్మో యూట్యూబర్ షణ్ముఖ్ కి… […]