Ram Charan: మెగాపవర్‌స్టార్ రామ్చారణ్ వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తుండగానే.. మరో సినిమాకు ఓకే చెప్పారు. ప్రముఖ దర్శకుడు శంకర్‌తోనూ సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు. వీరిద్దరి కాంబోలో సినిమా వస్తోందన్న వార్త రాగానే.. అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, తాజాగా, ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నట్లు చిత్రబృందం తెలిపింది.

అయితే, శంకర్ ఏ సన్నివేశాన్ని తొలుత చిత్రీకరించారన్న విషయంపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. కేజీఎఫ్ ఫేమ్ స్టంట్ మాస్టర్ అన్బిరువి సారథ్యంలో ఓ యాక్షన్ సీన్‌ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సినిమా మొదట్లో సాలిడ్ బజ్ నెలకొల్పిన ఇంటెన్స్ ట్రైన్ యాక్షన్ ఎపిసోడ్‌ను పూర్తి చేసినట్లు సమాచారం. సెట్స్‌లో ట్రైన్ ట్రాక్‌పై శంకర్ ఉన్న ఫొటో ఒకటి ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ విషయంపై చెర్రి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరోవైపు రోబోతో భారీ హిట్ కొట్టిన శంకర్. ఆతర్వాత వచ్చిన ఐ, రోబో2.0 సినిమాలు భారీ డిజాస్టర్‌ను మూటకట్టుకున్నాయి. దీంతో శంకర్- చెర్రి కాంబినేషన్లో వచ్చే సినిమా ఎలా ఉండబోతోందనే విషయంపై అనేక ఊహాగానాలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. మరోవైపు, భారతీయుడు 2 సినిమా కూడా శంకర్ తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. కాగా, చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్‌తో కలిసి నటించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.