Chiranjeevi: తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి స్థానం అనితరసాధ్యమైనది. దాదాపు మూడు దశాబ్దాలపాటు సినీ ఇండస్ట్రీని ఏక ఛత్రాధిపత్యంగా పాలించాడు. మకుఠం లేని మహారాజుగా వెలుగొందాడు. పరిశ్రమలో ఎవరి అండా లేకుండా లేకుండా ప్రవేశించి.. నెంబర్ వన్ హీరో స్థాయికి చేరుకోవడం చిరు స్టామినాకు నిదర్శనం. తెలుగులో అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న హీరో కూడా మెగాస్టారే. ఆయన రాజకీయాల్లోకి వెళ్లి పదేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ.. ఆ స్థానం అలాగే ఉంది. తిరిగొచ్చిన తర్వాత మళ్లీ రూలింగ్ స్టార్ట్ అయ్యింది. ఇంతటి స్టార్ డం ఉన్న మెగాస్టార్ కెరీర్లో అత్యధిక కలెక్షన్ సాధించిన్ చిత్రాలేవి? ఎంత సాధించాయి అన్నది చూద్దాం.

అంజి: భారీ అంచనాలతో విడుదలైన ఈ సోషియో ఫంటసీ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. 2004లో 24 కోట్ల వ్యాపారం సాగింది. అయితే.. ఈ మూవీ 12 కోట్లు మాత్రమే వసూల్ చేసింది.
అన్నయ్య: ఈ మూవీ 2000 సంవత్సరంలో విడుదలైంది. చిరు-సౌందర్య జంటగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ ఆయింది. 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ సాగితే.. 13 కోట్లు వసూల్ చేసింది.
జై చిరంజీవ : చిరు-సమీరా రెడ్డి-భూమిక కాంబోలో వచ్చిన ఈ మూవీ.. 2005లో రిలీజ్ ఆయింది. ఈ చిత్రానికి 18 కోట్ల బిజినెస్ సాగితే.. 12 కోట్లు మాత్రమే వసూల్ చేసింది.
ఠాగూర్ : మెగాస్టార్ కెరీర్లో ఈ సినిమా సాధించిన విజయం అమోఘం. సమాజంలో పేరుకుపోయిన అవినీతిని అంతమొందించే కాలేజీ ప్రొఫెసర్ గా నటించిన చిరు.. అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు. 2003లో విడుదలైన ఈ మూవీ.. అప్పట్లో 24 కోట్లు కలెక్ట్ చేసింది.
శంకర్ దాదా : 2004లో బచ్చిన ఈ మూవీ.. భారీ విజయం సాధించింది. 14 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా.. ఏకంగా 26 కోట్లు కలెక్ట్ చేసింది. దీనికి సీక్వెల్గా వచ్చిన శంకర్ దాదా జిందాబాద్ మాత్రం 18 కోట్లు రాబట్టింది.
ఇంద్ర: అప్పటి వరకూ వరుస ఫ్లాపులతో సతమతమైన చిరును.. మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కించిన చిత్రమిది. 2002లో విడుదలైన ఈ చిత్రం.. మెగాస్టార్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ఒకటిగా నిలిచింది. 13 కోత్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ.. ఏకంగా 27 కోట్లు కొల్లగొట్టింది.
ఖైదీ నెం.150: దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన చిత్రమిది. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ వచ్చిన ఈమూవీ.. ఏకంగా 104 కోట్లు వసూల్ చేసింది. చిరు కెరీర్లో వందకోట్లు సాధించిన తొలి సినిమా ఇదే.
Also Read: కంటెంట్ ఉన్నోడికి పంచ్ తో పని ఏమిటి ?
సైరా: ఉయ్యాలవాడ నరసిం హా రెడ్డి కథతో తెరకిక్కిన ఈ చిత్రంలో మెగాస్టార్ ఉగ్ర రూపాన్ని ప్రదర్శించారు. 2019లో విడుదలైన ఈ మూవీ.. ఏకంగా 140 కోట్లు కొలగొట్టింది. ఆ విధంగా.. మెగాస్టార్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. సెకంద్ ఇన్నింగ్స్ లో జోరుమీదున్న చిరు.. వరుస సినిమాలను అనౌన్స్ చేశారు. మరి, అవి ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాయో చూడాలి.
Also Read: Kareena Kapoor: ప్చ్.. కరీనా కూడా చాలా కష్టాలు చూసిందట !