Shankar – Ram Charan movie: #RRR వంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రామ్ చరణ్ సౌత్ ఇండియన్ సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ ఏడాదిలో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ అప్పుడే 70 శాతం వరుకు చిత్రీకరణ పూర్తి చేసుకుందట..ప్రస్తుతం టాలీవుడ్ లో సమ్మె నడుస్తున్న నేపథ్యం లో తాత్కాలికంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది..సమయం వృధా ఎందుకు చెయ్యడం అని శంకర్ గారు ఈ గ్యాప్ లో కమల్ హాసన్ ఇండియన్ 2 షూటింగ్ చేసుకొస్తానని చెన్నై వెళ్లారు..అయితే ఇప్పుడు ఈ సినిమాకి టెక్నిషన్స్ నుండి నిర్మాత దిల్ రాజు కి తలనొప్పి ఎదురు అయ్యింది.
అసలు విషయానికి వస్తే ఈ సినిమాకి ప్రొడక్షన్ డిజైనర్స్ గా రామకృష్ణ – మౌనికలను తీసుకున్నాడు దిల్ రాజు..వీళ్లిద్దరు గతం లో రామ్ చరణ్ హీరో గా నటించిన రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాకి పని చేసారు..ఈ సినిమాలో సెట్స్ అన్ని సహజ తత్వానికి ఎంతో దగ్గరగా ఉంటుంది. ప్రతి సెట్ లోను గొప్ప పనితనం కనిపిస్తాది..అందుకే వాళ్ళని తన సినిమాకి కూడా తీసుకున్నాడు దిల్ రాజు. కానీ దిల్ రాజు తో రామకృష్ణ-మౌనికలకు క్రియేటివ్ డిఫరెన్స్ ఏర్పడడం వల్ల వీళ్లిద్దరు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. ఇక ఆ తర్వాత వీరి స్థానం లోకి రవీంద్ర రెడ్డి గారిని తీసుకున్నాడు దిల్ రాజు..హైదరాబాద్ లోని శంషాబాద్ లో ఒక భారీ యూనివర్సిటీ సెట్ ని ఈ సినిమా షూటింగ్ కోసం నిర్మిస్తున్నారు. ఈ సమయం లోనే దిల్ రాజు తో క్రియేటివ్ డిఫరెన్స్ ఏర్పడింది అట. అందువల్ల ఈయన కూడా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. దిల్ రాజు కి ఇది 50 వ సినిమా. పైగా శంకర్ – రామ్ చరణ్ కాంబినేషన్ కావడం తో ఖర్చుకి ఆయన ఏ మాత్రం కూడా వెనకాడడం లేదు.
ఇప్పటికే ఈ సినిమా కోసం దాదాపుగా 150 కోట్ల రూపాయిలు ప్రొడక్షన్ కాస్ట్ అయ్యినట్టు సమాచారం. క్లైమాక్స్ కి సంబంధించిన కీలక సన్నివేశాలు మరియు మూడు పాటల చిత్రీకరణ మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయినట్టు తెలుస్తుంది. ఇక శంకర్ సినిమాలలో పాటలు విసువల్ పరంగా ఎంతో రిచ్ గా ఉంటాయో మన అందరికి తెలిసిందే. ఈ సినిమాలో కూడా అదే రేంజ్ లో ఉండబోతున్నాయట..ఈ ఏడాది చివరి లోగ షూటింగ్ మొత్తం పూర్తి చేసి ఛాన్స్ ఉంటె పొంగల్ కి వద్దాం అనే ఆలోచనలో ఉన్నాడు దిల్ రాజు..ఈ సినిమా సంక్రాంతి సీజన్లో వస్తే బాక్స్ ఆఫీస్ సునామి ని సృష్టించడం ఖాయమని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.