Ram Charan: మెగాస్టార్ కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చాలా తక్కువ సమయంలోనే పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఆయనతో సినిమాలు చేయడానికి ఇండియాలో ఉన్న దర్శకులు అందరూ పోటీ పడుతున్నారు అంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఒకప్పుడు ఆయనకు యాక్టింగ్ రాదు అంటూ అందరూ హేళన చేసిన కూడా వాటన్నింటిని పట్టించుకోకుండా పనిమీద పూర్తి ఫోకస్ పెట్టి సినిమా సినిమాకు తనలోని యాక్టింగ్ లెవెల్స్ ని పెంచుకుంటూ వచ్చాడు. దాని ఫలితంగా రంగస్థలం సినిమాలో ది బెస్ట్ పర్ఫామెన్స్ ఇవ్వడమే కాకుండా ఆ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను కూడా సాధించాడు.
ఇక ఇప్పుడు శంకర్ తో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా మీద ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దానిపైన ప్రతి ప్రేక్షకుడిలో కూడా విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇక ప్రేక్షకులతో పాటు రామ్ చరణ్ కి కూడా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో శంకర్ ఒక క్లారిటీ ఇవ్వలేకపోతున్నాడు అనే వార్త కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఎప్పటి నుంచో ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. ఇప్పటికి రెండు సంవత్సరాల నుంచి శంకర్ ఈ సినిమాని చేస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ ఈ సినిమా రిలీజ్ డేట్ మీద క్లారిటీ రావడం లేదు.
ఇక దాంతో ఈ ఇయర్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే స్టార్ హీరోలందరూ వాళ్ళ సినిమాలకు సంబంధించిన డేట్స్ అన్నింటిని లాక్ చేసి కూర్చున్నారు. కానీ ఇప్పటి వరకు గేమ్ చెంజర్ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ రాకపోవడం గమనార్హం. త్రిబుల్ ఆర్ సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడే రామ్ చరణ్ ఈ సినిమాని స్టార్ట్ చేశాడు. అయిన కూడా ఇంకా ఈ సినిమా రిలీజ్ కావడం లేదు. త్రిబుల్ ఆర్ సినిమా చేసిన తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని దేవర సినిమా స్టార్ట్ చేశాడు.
అయినప్పటికీ ఈనెల ఏప్రిల్ లో ఆ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. దాంతో శంకర్ ప్రవర్తన ఇప్పుడు రామ్ చరణ్ కి చిరాకు పుట్టిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికైనా ఈ సినిమా రిలీజ్ డేట్ మీద అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.