
India Vs Australia 1st Odi: ముంబాయ్ వాంఖడే స్టేడియం లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ భారీ స్కోర్ సాధించడం ఖాయం అనిపించింది. హార్దిక్ కూడా అదే అనుకున్నాడు. పైగా ఈ మైదానం లో చివరి వన్డే ఆడిన ఆసీస్.. వార్నర్, ఫించ్ శతకాలు బాదటంతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఎలా చూసుకున్నా ఆసీస్ కే కొంత మొగ్గు కనిపిస్తున్నది. మరో వైపు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది. వాంఖడే స్టేడియం బ్యాటింగ్ కు అనుకూలిస్తుంది. దీంతో భారీ స్కోర్ చేయాలని ఆసీస్ అనుకున్నది..కానీ తొలి అడుగే తడబడింది..1.6 ఓవర్ లో హెడ్ రూపంలో వికెట్ కోల్పోయింది.. సిరాజ్ వేసిన అద్భుతమైన బంతిని తప్పుగా అంచనా వేసిన హెడ్ క్లీన్ బౌల్ద్ అయాడు.ఈ దశలో వన్ డౌన్ బ్యాట్స్ మెన్ గా స్మిత్ వచ్చాడు..మరో ఓపెనర్ మార్ష్ తో కలిసి ఇన్నింగ్స్ చక్క దిద్దే ప్రయత్నం చేశాడు.ఈ జోడీ భారత బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని పాండ్యా విడదీశాడు. పాండ్యా వేసిన బంతి స్మిత్ బ్యాట్ చివరి అంచుకు తాకింది. దానిని కే ఎల్ రాహుల్ అమాంతం ఒడిసి పట్టాడు. ఈ క్యాచ్ చూసి స్మిత్ ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యాడు.నిరాశగా మైదానం వీడాడు. హెడ్,స్మిత్ జోడి రెండో వికెట్ కు 72 పరుగులు జోడించారు.
తర్వాత వచ్చిన లాబుస్చాగ్నే(15) ను కుల దీప్ యాదవ్, జోష్ ఇంగ్లీష్ ను షమీ ఔట్ చేయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ అంత జోరుగా సాగలేదు. మరో ఎండ్ లో ఉన్న మార్ష్ మాత్రం ధాటిగా బ్యాటింగ్ చేశాడు. అప్పటికి ఆసీస్ స్కోర్ 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు. ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన కామెరున్ గ్రీన్ కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. 12 పరుగులు చేసిన అతడు షమి బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. అప్పటికి ఆస్ట్రేలియా స్కోర్ ఆరు వికెట్ల నష్టానికి 174.
11 పరుగుల వ్యవధి లో నాలుగు వికెట్లు
ఆరు వికెట్లు కోల్పోయినప్పటికీ క్రీ జు లో మాక్స్ వెల్ ఉండడంతో భారీ స్కోరు సాధ్యమవుతుందని ఆస్ట్రేలియా నమ్మకం పెట్టుకుంది. అయితే మ్యాక్స్ వెల్ ను రవీంద్ర జడేజా అద్భుతమైన బంతికి బోల్తా కొట్టించాడు. మార్కస్ స్టోయినిస్, అబాట్, ఆడం జంపా…ఇలా వచ్చిన బ్యాట్స్ మెన్ వచ్చినట్టు వెనుదిరగడంతో ఆసీస్ 35.4 ఓవర్లలో 188 పరుగులకు ఆల్ అవుట్ అయింది. చివరి 11 పరుగుల వ్యవధిలో ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోవడం విశేషం.

ఇక ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేశారు..ఒక్క రెండో వికెట్ మినహా మిగతా వికెట్లు సులభంగానే తీశారు. ఏ వికెట్ కూడా భారీ భాగస్వామ్యం నెలకొల్పకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు..షమీ, సిరాజ్ మూడు,జడేజా రెండు, పాండ్యా, కులదీప్ చేరో వికెట్ తీశారు.