
Rajamouli- Mahesh Babu: దర్శక ధీరుడు రాజమౌళి తాను తెరకెక్కించిన #RRR మూవీ కి ఆస్కార్ అవార్డు రావడం తో ఫుల్ జోష్ మీద ఉన్నాడు.ఇన్ని రోజులు సినిమా కోసం పని చేసి క్షణం తీరిక లేకుండా గడిపిన రాజమౌళి,రీసెంట్ వరుసగా అవార్డ్స్ ఫంక్షన్స్ కి హాజరవుతూ పూర్తిగా అలసి పొయ్యాడు.ఒక్క రెండు నెలలు పూర్తిగా విరామం తీసుకొని ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో చెయ్యబొయ్యే సినిమా గురించి పూర్తిగా ద్రుష్టి సారించబోతున్నాడు.
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పనులు చకచకా జరిగిపోతున్నాయి.ఈ ఏడాది లోనే ఈ సినిమా సెట్స్ మీదకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు.ఇది ఇలా ఉండగా ఈరోజు సోషల్ మీడియా లో రాజమౌళి మహేష్ బాబు ని కలిసిన ఫోటో ఒకటి లీకై తెగ వైరల్ గా మారింది.అయితే ఈ ఫోటో ఎప్పటిది అనే దానిపై చర్చలు నడుస్తున్నాయి.

రాజమౌళి అమెరికా నుండి ఇండియా కి తిరిగి రాగానే మహేష్ – త్రివిక్రమ్ షూటింగ్ సెట్స్ కి వెళ్లి కలిసాడని కొంతమంది అనుకుంటుంటే, ఇది ఇప్పటి ఫోటో కాదు, న్యూ ఇయర్ అప్పుడు మహేష్ ని రాజమౌళి కలిసినప్పటి ఫోటో అంటూ మరికొందరు కామెంట్స్.ఎప్పటి ఫోటో అనేది కాసేపు పక్కన పెడితే, వాళ్ళిద్దరిని అలా ఒక చోట చూడడం అభిమానులకే కాదు, ప్రేక్షకులకు కూడా కనులపండుగ లాగ ఉంది.ఇద్దరికీ ఇద్దరే, తెలుగు సినిమాలో ఇండస్ట్రీ లో రికార్డ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే పేర్లు ఇవి.అలాంటి రెండు సునామీలు కలిసి ఒక ప్రాజెక్ట్ కి పని చేస్తే బాక్స్ ఆఫీస్ పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
ఒకవేళ రాజమౌళి రీసెంట్ గానే కలిసి ఉంటే ఈ ఉగాదికి అనగా మార్చి 22 వ తారీఖున ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఏదైనా అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.#RRR సినిమాతో మన తెలుగు సినిమాలకు పాన్ వరల్డ్ లో మార్కెట్ ఓపెన్ అయ్యింది.మహేష్ – రాజమౌళి చిత్రం క్లిక్ అయితే ఇక కలెక్షన్స్ పరంగా హాలీవుడ్ సినిమాలతో పోల్చుకోవాల్సిందే అంటున్నారు ట్రేడ్ పండితులు.