నటీనటులు : ఆది సాయి కుమార్, అర్చన అయ్యర్, హర్షవర్ధన్, మధుసూదన్, రవి వర్మ తదితరులు…
డైరెక్టర్ : యుగంధర్ ముని
మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీ చరణ్ పాకాల
నిర్మాతలు : రాజశేఖర్, మహీధర రెడ్డి
సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతోంది. మన దర్శకులు మంచి కథలతో వచ్చి సక్సెస్ లను సాధిస్తున్నారు. ఎప్పుడైతే బాహుబలి సినిమా వచ్చిందో అప్పటి నుంచి మన కథలకి, సినిమాలకి డిమాండ్ పెరిగిపోయింది. ఇండియాలో ఉన్న ప్రతి ఇండస్ట్రీ మన సినిమాల వైపే ఆసక్తిగా చూస్తున్నారు అంటే మన సినిమా క్వాలిటీ ఏ రేంజ్ లో పెరిగిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు… ఇక ప్రస్తుతం స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలు కూడా వాళ్ళ సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ‘ప్రేమ కావాలి’ సినిమాతో హీరోగా పరిచయమైన ఆది సాయికుమార్ మొదటి సినిమాతోనే సక్సెస్ ను సాధించాడు.
ఆ తర్వాత చేసిన సినిమాలతో ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయాడు. సక్సెస్ లు రాకపోయిన వరుసగా సినిమాలు మాత్రం చేస్తున్నాడు. వరుసగా 22 సినిమాలతో డిజాస్టర్ లను మూటగట్టుకున్న ఆయన శంభాల అంటూ మరో కొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉంది? సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం చర్చిద్దాం…
కథ
1000 ఏళ్ల చరిత్ర ఉన్న ‘శంభాల’ అనే ఊరిలో ఆకాశం నుంచి ఒక ఉల్కా పడుతుంది. ఇక అప్పటి నుంచి ఊరిలో విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. అక్కడి ప్రజలు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం. హత్యలు చేయడం, ఇంకొందరు ఆత్మహత్య లు చేసుకోవడం లాంటివి చేస్తారు. ఇక ఊరికి బండ భూతం అవహించిందంటూ అందరిలో భయం స్టార్ట్ అవుతోంది. దాంతో పాటు మూఢనమ్మకాలు కూడా మొదలవుతాయి. క్షణం ఒక నరకంగా బతుకుతున్న ఆ ఊరి లోకి ప్రభుత్వం విక్రమ్ (ఆది సాయి కుమార్) అనే ఒక సైంటిస్ట్ ను పంపిస్తుంది. అక్కడ అసలు ఏం జరుగుతుంది మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని చెబుతోంది. ఆ ఊరికి వెళ్ళిన విక్రమ్ కి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. అక్కడి ప్రజలకు తను అండగా నిలిచాడా? విక్రమ్ వాళ్ల ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ చూపించాడా? లేదా అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
నిఖిల్ హీరోగా చేసిన ‘కార్తీకేయ’ సినిమా వచ్చినప్పటి నుంచి మిస్టరీ థ్రిల్లర్ జానర్ కి డిమాండ్ పెరిగింది. ఆ జానర్ లోనే ఎక్కువ సినిమాలు వస్తున్నాయి. ఇక ‘శంభాల’ సైతం అదే కోవకి చెందిన సినిమా కావడం విశేషం…దర్శకుడు ఈ సినిమా కథను బాగా రాసుకున్నాడు. థ్రిల్లింగ్ అంశాలను సైతం ఎక్కువగా జోడించాడు. సినిమా స్టార్టింగ్ పర్లేదు అనిపించేలా ఉంది. అలాగే సినిమా కథలోకి ఎంటర్ అయిన తర్వాత కొన్ని భయానక సన్నివేశాలు ఎదురవ్వడంతో ప్రేక్షకుడు సినిమాకి కనెక్ట్ అయి చూస్తుంటాడు. ముఖ్యంగా చెరుకు తోటలోని సన్నివేశాలు సినిమా చూస్తున్న వాళ్లలో భయాన్ని పుట్టిస్తాయి. ఇక ఫస్టాఫ్ లో వచ్చే సన్నివేశాలు వేటికి కూడా ప్రాపర్ ఎండింగ్ ఉండదు. ఏదో అసంతృప్తి గా అనిపిస్తుంది. కానీ వాటికి సెకండాఫ్ లో క్లారిటీ ఇచ్చాడు. ఇంటర్వెల్ కి ముందు సినిమాను కొంచెం రైజ్ చేసి వదిలేస్తాడు.
సెకండాఫ్ లో ఊరు దేవత కి సంబంధించిన స్టోరీ, ఆ బండ భూతానికి ఊరికి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి? అనే విషయాలను తెలుసుకోవడానికి హీరో ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఆ సన్నివేశాలు ప్రేక్షకుడికి బాగా కనెక్ట్ అవుతాయి. ఎమోషనల్ సన్నివేశాలను సైతం ప్రేక్షకుడి హృదయానికి హత్తుకునేలా రాసుకున్నారు… ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ ఉంటుంది అనుకునే హీరో క్యారెక్టర్ ఆర్క్ బాగా డిజైన్ చేశారు…ఇక కథ పరంగా సినిమా అద్భుతంగా ఉంది. కానీ డైరెక్షన్ అక్కడక్కడ మైనస్ అయింది. గ్రాండియర్ గా చూపించే సన్నివేశాలు సైతం ఏదో అలా చుట్టేశారు అనే ఫీల్ కలుగుతోంది. సీజీ వర్క్ అయితే మరి దారుణం గా ఉంది. కొన్ని చోట్ల అది సీజీ అని మనకు తెలిసిపోతోంది. బహుశా డైరెక్టర్ కి అనుకున్న బడ్జెట్ ఇచ్చి ఉండరు. అందుకే సినిమా అంత రిచ్ గా తీయలేకపోయాడు.
ఆది సాయి కుమార్ ఒక డీసెంట్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. గతంలో ఆయన ఇలాంటి ఒక ఇంటెన్స్ క్యారెక్టర్ చేయలేదు. కాబట్టి ఈ పాత్రలో తను చాలా కొత్తగా కనిపించడమే కాకుండా ఆ క్యారెక్టర్ ను పెర్ఫెక్ట్ గా డెలివరీ చేశాడు…నాస్తికుడిగా ఆయన నటన బాగుంది. అలాగే అర్చన అయ్యర్ యాక్టింగ్ కూడా బాగుంది. మధుసూదన్ తన క్యారెక్టర్ ను పర్ఫెక్ట్ గా చేసి సినిమా సక్సెస్ కి హెల్ప్ అయ్యాడు. హర్షవర్ధన్ , రవి వర్మ లు సైతం సినిమాకి చాలా బాగా హెల్ప్ అయ్యారు…
శ్రీ చరణ్ పాకాల అందించిన మ్యూజిక్ ఒకే అనిపించేలా ఉంది. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం బాగా ఇచ్చాడు. సినిమా సెన్స్ మిస్ అవ్వకుండా పర్ఫెక్ట్ గా డీల్ చేశాడు…ప్రవీణ్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా మూడ్ ను చెడగొట్టకుండా ఎక్కడ ఏ షాట్ కావాలి, అది సినిమాకి ఎంతవరకు హెల్ప్ అవుతోంది అనే ధోరణిలో ఆలోచించి షాట్స్ కంపోజ్ చేసుకున్నాడు…ఇక ప్రొడక్షన్ వాల్యూస్ అంత రిచ్ గా లేవు…ఉన్న దాంట్లోనే సర్దేశారు…
బాగున్నవి
కథ, స్క్రీన్ ప్లే
ఆది యాక్టింగ్
బ్యాగ్రౌండ్ మ్యూజిక్
బాగోలేనివి
అక్కడక్కడ డైరెక్షన్ మిస్ అయింది…
ప్రొడక్షన్ వాల్యూస్
సీజీ వర్క్
రేటింగ్ 2.5/5
ఫైనల్ వర్డ్ : థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది…
