Shambhala Movie 1st Day Collections: ఆది సాయికుమార్ హీరోగా ఎంట్రీ ఇచ్చి 13 సంవత్సరాలు అవుతున్నప్పటికి అతనికి సరైన సక్సెస్ అయితే రావడం లేదు. ఇక రీసెంట్గా శంభాల సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు… ఇప్పటివరకు ఉన్న యంగ్ హీరోలందరు వరుస సక్సెస్ లను సాధిస్తుంటే ఆది మాత్రం కొంతవరకు వెనుకబడిపోయాడు. దాదాపు 22 సినిమాలు ప్లాప్ లను మూటగట్టుకున్న తర్వాత అతనికి ఇప్పుడు సక్సెస్ దక్కింది…
ఇక శంభాల సినిమా 12 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. మొదటి రోజు రెండు కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఈ వీకెండ్ సక్సెస్ ఫుల్ టాక్ ను సంపాదించుకుంది. కాబట్టి ఈ వీకెండ్ కలెక్షన్స్ పెరిగే అవకాశాలైతే ఉన్నాయి. మరో మూడు రోజులపాటు ఈ సినిమా తన హవాని కొనసాగించే అవకాశాలైతే లేకపోలేదు.మొత్తానికైతే ఇందులో ఉన్న హార్రర్ ఎలిమెంట్స్ గాని, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ గాని ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్నాయి.
కాబట్టి ఈ సినిమా లాంగ్ రన్ లో భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టే అవకాశాలైతే ఉన్నాయి. మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ ని బేస్ చేసుకొని ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుందనేది చెప్పడం కష్టం… ఈ మూడు రోజులు గడిస్తే అప్పుడు ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుందనే విషయంలో ఒక క్లారిటీ వస్తుందంటూ సినిమా మేధావులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… ఇక ఆది సాయికుమార్ ఇకమీదటైనా రాబోయే సినిమాలతో మంచి విజయాలను సాధిస్తూ సక్సెస్ ఫుల్ ట్రాక్ ను కొనసాగిస్తూ ముందుకు సాగితే మంచింది.
అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా సినిమాలు చేసుకుంటే వెళ్తే మాత్రం మరోసారి తన కెరియర్ ను తనే చేతులారా నాశనం చేసుకున్నవాడవుతాడు…ఇక ఇప్పుడున్న యాంగ్ హీరోలకు పోటీని ఇవ్వగలిగే కెపాసిటీ ఆది కి ఉందా లేదా అనేది తెలియాల్సి ఉంది…మొత్తానికైతే ఇన్ని ఇయర్స్ తర్వాత పట్టు పట్టి మరి సక్సెస్ లను సాధించడం అనేది నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పాలి…