Champion Movie Budget: వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ ప్రొడ్యూసర్ గా స్టార్ హీరోలతో చాలా గొప్ప సినిమాలను తెరకెక్కించాడు. సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలకు గొప్ప విజయాలను సాధించి పెట్టిన ఘనత కూడా ఈ బ్యానర్ కి దక్కింది. మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన బ్యానర్ కూడా ఇదే కావడం విశేషం… గత కొద్ది రోజుల నుంచి అశ్వినీ దత్ సినిమాలను ప్రొడ్యూస్ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కానీ తన కూతురైన స్వప్న దత్ మాత్రం మంచి కాన్సెప్ట్ తో వచ్చే యాంగ్ డైరెక్టర్లను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు.
ఇక అందులో భాగంగానే ప్రదీప్ అద్వైతం చెప్పిన ఒక కథ అద్భుతంగా ఉండటంతో ‘ఛాంపియన్’ పేరుతో ఈ సినిమాని తెరకెక్కించారు. ఇందులో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించాడు. రీసెంట్ గా ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్నప్పటికి కలెక్షన్స్ పరంగా మాత్రం చాలా వీక్ గా ఉందనే చెప్పాలి.
30 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాకి మొదటి రోజు కేవలం 2 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. ఈ సినిమా పెట్టిన బడ్జెట్ ను రికవరీ చేస్తోందా? లేదా అనే డైలామా లో అయితే మేకర్స్ ఉన్నారు…ఎలాంటి ఫేమ్ లేని ఒక కొత్త హీరో మీద అన్ని కోట్ల బడ్జెట్ పెట్టడం అనేది సాహసం అనే చెప్పాలి.
వైవిధ్య ఫలితమైన కథాంశం దొరికింది కాబట్టే తన మీద అన్ని కోట్లు పెట్టినట్టుగా స్వప్న దత్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమాకి దక్కుతున్న ఆదరణను బట్టి పెట్టిన బడ్జెట్ రికవరీ అవుతుందా? లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. పెద్ద బ్యానర్ నుంచి చిన్న సినిమాలు వచ్చినప్పుడు వాటికి ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కుతోంది. కానీ ఆ మూవీస్ లాంగ్ రన్ లో ఎంతటి కలెక్షన్స్ ను కొల్లగొడుతాయి అనే దాని మీదనే ఈ సినిమా సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది…