Guess Actress
Guess Actress: తన గ్లామర్ తో సూర్యుడినే డామినేట్ చేస్తుంది ఈ హీరోయిన్. సాగర తీరాన సాయం సంధ్య వేళ సేద తీరుతూ కనిపించింది. ఇంతకీ ఈ హాట్ బ్యూటీ ఎవరో మీరు కనిపెట్టారా ?.. ఆమె ఎవరో కాదు షామా సికిందర్. తెలుగు ప్రేక్షకులకు షామా సికిందర్ అంతగా పరిచయం లేదు. ఈమె గురించి తెలిసింది తక్కువే. రాజస్థాన్ లో పుట్టిన షామా సికిందర్ మోడల్ గా కెరీర్ మొదలుపెట్టింది. 1998లో ప్రేమ్ అగ్గన్ అనే చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. అనంతర అమిర్ ఖాన్ హీరోగా నటించిన మన్ చిత్రంలో నటించింది. మనీషా కొయిరాలా ఈ చిత్ర హీరోయిన్.
ప్రేమ్ అగ్గన్, మన్ చిత్రాల్లో షామా సికిందర్ చిన్న పాత్రలు చేసింది. అన్ష్ చిత్రంలో సపోర్టింగ్ రోల్ చేసింది. సినిమాల్లో అడపాదడపా పాత్రలు చేస్తూ ఆమె సీరియల్ నటిగా మారింది. ఏ మేరీ లైఫ్ హై అనే సీరియల్ లో లీడ్ రోల్ చేసింది. ఈ సీరియల్ షామా సికిందర్ కి భారీ ఫేమ్ తెచ్చిపెట్టింది. బుల్లితెరపై కొన్నాళ్ళు మెరిసింది. టెలివిజన్ హోస్ట్ గా సైతం వ్యవహరించింది.
2016లో మాయ టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ చేసింది. మరో వెబ్ సిరీస్లో నటించి, నిర్మించింది. మల్టీ టాలెంటెడ్ గా పేరు తెచ్చుకున్న షామా సింకిందర్ మ్యూజిక్ వీడియోలు సైతం చేసింది. షామా సికిందర్ ఆరు భాషలు మాట్లాడగలదట. కాగా షామా సింకిందర్ సిల్వర్ స్క్రీన్ కి దూరమై చాలా కాలం అవుతుంది. 2019లో విడుదలైన బై పాస్ రోడ్ ఆమె చివరి చిత్రం.
అయితే షామా సికిందర్ సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటుంది. ఇంస్టాగ్రామ్ లో ఆమెను 3 మిలియన్స్ కి పైగా ఫాలో అవుతున్నారు. గ్లామరస్ ఫోటో షూట్స్, వీడియోలతో నెటిజెన్స్ ని ఆమె ఆకర్షిస్తుంది. షామా సికిందర్ హాట్ ఫోటోలపై నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తుంటారు.
షామా సికిందర్ 2011లో అమెరికన్ యాక్టర్ అలెక్స్ ఓ నెల్ తో ప్రేమలో పడింది. 2015 వరకు అతడితో రిలేషన్ లో ఉంది. అనంతరం అలెక్స్ కి బ్రేకప్ చెప్పింది. అనంతరం 2016లో దుబాయ్ బిజినెస్ మ్యాన్ జేమ్స్ మిల్లిరాన్ తో రిలేషన్ స్టార్ట్ చేసింది. వీరిద్దరూ 2022లో వివాహం చేసుకున్నారు. పెళ్లయ్యాక ఆమె సినిమాలు చేయడం లేదు.
Web Title: Shama sikander latest photos are going viral on social media
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com