Shakeela On Vadivelu: తెలుగులో హాస్యానికి బ్రహ్మానందం ఎలాగో, తమిళనాడు లో వడివేలు అలాంటి స్థాయికి చేరుకున్నారు. అలాంటి నటుడిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ‘మామన్నన్’ చిత్రం ద్వారా తెరమీదకు వచ్చిన వడివేలు ఆ సినిమాతో సూపర్ హిట్ సొంతం చేసుకున్నాడు. అందులో అతని నటనకు మంచి మార్కులే పడ్డాయి. కానీ అదే సమయంలో అనేక వివాదాలు వడివేలు ను చుట్టుముట్టాయి.
ఒకప్పుడు మలయాళంలో స్టార్ హీరోలకు సైతం పోటీ ఇచ్చిన నటి షకీల్ మీడియా సాక్షిగా వడివేలు మీద చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం చిన్న చిన్న రోల్స్ చేస్తూ, ఒక యూట్యూబ్ ఛానల్ లో యాంకర్ గా చేస్తున్న షకీలా అందులో భాగంగా తమిళ నటి ప్రేమ ప్రియను ఇంటర్వ్యూ చేసింది. ఇందులో ప్రేమ ప్రియా మాట్లాడుతూ “నా కెరీర్ మొదట్లో వడివేలు, వివేక్, సంతానం లాంటి వాళ్లతో కలిసి చిన్న చిన్న పాత్రలు వేశాను. అప్పట్లో నాకు అవకాశాలు బాగానే వచ్చాయి. కానీ రాను రాను అవి తగ్గిపోయాయి.
ఎందుకు ఇలా జరిగిందో అర్ధం అయ్యేది కాదు. కానీ తర్వాత తెలిసింది. నా ఎదుగుదల నచ్చక వడివేలు కావాలనే నాకు వచ్చే అవకాశాలను దూరం చేస్తున్నట్లు. ఎన్నో అవకాశాలు వచ్చినట్లే వచ్చి, దూరం అయ్యాయి. ఒక్కోసారి ఎలాగోలా అవకాశం పట్టుకొని షూటింగ్ కి వెళ్లిన కానీ అక్కడ వడివేలు ఉంటే మాత్రం అక్కడి నుండి పక్కకు వెళ్లి, ఆ అమ్మాయి వద్దు అంటూ మేకర్స్ కి చెప్పి నన్ను వెనక్కి పంపేవాడు అంటూ కామెంట్స్ చేసింది.
దీనితో షకీలా మాట్లాడుతూ మరి వడివేలు మీద మీ-టూ ఫిర్యాదు చేయవచ్చు కదా అంటూ అడిగింది. అందుకు ప్రేమ ప్రియా మాట్లాడుతూ మా మధ్య మీ టూ సమస్య లేదని, మరో సమస్య ఉందని చెప్పింది. దీంతో షకీలా మాట్లాడుతూ వడివేలు తనకు బాగా తెలుసనీ, షూటింగ్ స్పాట్ లో ఎలా ఉంటాడో, ఏమి అడుగుతాడో నాకు తెలుసు అంటూ షకీలా చెప్పుకొచ్చింది. ఇప్పుడు అవే వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే వడివేలు మంచి ఫామ్ లో ఉన్నప్పుడు తమిళ సినీ పరిశ్రమ అతనిపై నిషేధం విధించింది. అందుకే కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు వడివేలు.