https://oktelugu.com/

Shakeela: అల్లరి నరేష్ తండ్రి నన్ను కమిట్మెంట్ అడిగాడు… ఇండస్ట్రీని ఊపేస్తున్న షకీలా ఆరోపణలు

లైంగిక వేధింపుల కారణంగా నేను పరిశ్రమకు దూరమయ్యానని విచిత్ర ఆరోపించారు. ఆ హీరో ఎవరు అనేది ఆమె చెప్పలేదు. విచిత్ర ఇచ్చిన సమాచారం ఆధారంగా అది బాలకృష్ణ అనే వాదన తెరపైకి వచ్చింది.

Written By:
  • NARESH
  • , Updated On : November 28, 2023 / 01:49 PM IST

    Shakeela

    Follow us on

    Shakeela: బిగ్ బాస్ షో వేదికగా నటి విచిత్ర చేసిన కామెంట్స్ ప్రకంపనలు రేపగా… షకీలా మరో బాంబు పేల్చింది. దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తనను కమిట్మెంట్ అడిగాడని ఆమె ఓపెన్ అయ్యారు. బిగ్ బాస్ తమిళ్ సీజన్ 7లో పాల్గొన్న విచిత్ర టాలీవుడ్ స్టార్ హీరో గదికి రమ్మన్నాడని చెప్పింది. ఆ హీరో తాగి నా గది రూమ్ కొట్టేవాడు. హోటల్ సిబ్బంది సహకరించడంతో నేను రోజుకో రూమ్ మారేదాన్ని. నేను లొంగలేదని ఆ మూవీ సెట్స్ లో నన్ను కొట్టారు. ఫిర్యాదు చేస్తే నడిగర్ సంఘం పట్టించుకోలేదని ఆమె అన్నారు.

    ఈ లైంగిక వేధింపుల కారణంగా నేను పరిశ్రమకు దూరమయ్యానని విచిత్ర ఆరోపించారు. ఆ హీరో ఎవరు అనేది ఆమె చెప్పలేదు. విచిత్ర ఇచ్చిన సమాచారం ఆధారంగా అది బాలకృష్ణ అనే వాదన తెరపైకి వచ్చింది. భలేవాడివి బాసూ మూవీలో విచిత్ర నటించింది. ఆ మూవీ సెట్స్ లోనే ఆమెపై బాలకృష్ణ వేధింపులకు పాల్పడ్డారని సోషల్ మీడియా టాక్.

    కాగా విచిత్రకు నటి షకీలా మద్దతుగా నిలిచారు. అయితే విచిత్ర ఆ హీరో పేరు ధైర్యంగా చెప్పాల్సింది అన్నారు. విచిత్ర నేను ఫ్రెండ్స్. కలిసి కొని చిత్రాలు చేశామని షకీలా అన్నారు. అలాగే తనకు కూడా ఈ అనుభవం ఎదురైందని ఆమె ఓపెన్ అయ్యారు. దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తనను కమిట్మెంట్ అడిగాడని షకీలా ఆరోపణలు చేశారు.

    ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఒక చిత్రంలో నేను నటించాను. ఆయన నన్ను అడ్జస్ట్ అవ్వమని అడిగారు. నువ్వు నా గదికి వస్తే నా నెక్స్ట్ మూవీలో ఆఫర్ ఇస్తాను అన్నాడు. ఈ సినిమాకు నాకు పేమెంట్ వచ్చేసింది. మీ నెక్స్ట్ మూవీలో నాకు ఆఫర్ వద్దు. నేను అడ్జస్ట్ కాను అని చెప్పేశాను, అని షకీలా అన్నారు. ఎవరు ఎక్కడికి పిలిచి అడిగా… ఇదే విషయం చెబుతానని షకీలా అన్నారు. షకీలా ఆరోపణలు టాలీవుడ్ లో చర్చకు దారి తీశాయి.