https://oktelugu.com/

Allu Arjun: ఏకంగా షారుఖ్ ఖాన్ రికార్డు లేపేసిన అల్లు అర్జున్! ఇది మామూలు అరాచకం కాదు

అల్లు అర్జున్ క్రేజ్ ఏమిటో పుష్ప 2 రుజువు చేసింది. ఏకంగా బాలీవుడ్ హీరోల రికార్డులను అల్లు అర్జున్ లేపేశాడు. ఫస్ట్ డే హిందీ హైయెస్ట్ ఓపెనింగ్ రికార్డు పుష్ప 2 బద్దలు కొట్టింది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కి అల్లు అర్జున్ షాక్ ఇచ్చాడు. ఆ వివరాలు ఏమిటో చూద్దాం.

Written By:
  • S Reddy
  • , Updated On : December 6, 2024 / 01:24 PM IST

    Allu Arjun

    Follow us on

    Allu Arjun: ఫస్ట్ షో నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న పుష్ప 2 వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఇండియా వైడ్ ఈ మూవీ మొదటి రోజు రూ. 175 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. ఆర్ ఆర్ ఆర్ పేరిట ఉన్న రూ. 156 కోట్ల రికార్డు బ్రేక్ అయ్యింది. కాగా తెలుగు రాష్ట్రాలతో సమానంగా హిందీలో ఈ చిత్రానికి రెస్పాన్స్ దక్కడం విశేషం. రెండు భాషల్లో మొదటి రోజు రూ. 50 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించిన చిత్రంగా పుష్ప 2 మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. హిందీ, తెలుగు భాషల్లో పుష్ప 2 అర్ధ సెంచరీ దాటింది.

    కాగా బాలీవుడ్ లో షారూఖ్ రికార్డు లేపేశాడు బన్నీ. షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ మూవీ రూ. 65 కోట్ల నెట్ వసూళ్లు అందుకు ఆల్ టైం టాప్ గా ఉంది. పుష్ప 2 రూ. 67 కోట్ల నెట్ వసూళ్లతో మొదటి స్థానం కైవసం చేసుకుంది. యానిమల్ మూవీ రూ. 55 కోట్ల వసూళ్ల రికార్డు సైతం కొట్టుకుపోయింది. ఒక సౌత్ హీరో హిందీ వెర్షన్ అక్కడి హీరోల రికార్డులను బ్రేక్ చేయడం అనూహ్య పరిణామం.

    ఇక వరల్డ్ వైడ్ అన్ని భాషల్లో కలిపి పుష్ప 2 గ్రాస్ రూ. 200 కోట్లకు పైమాటే. ఈ మధ్య కాలంలో పుష్ప 2 అతిపెద్ద ఓపెనింగ్ డే రికార్డు నమోదు చేసిన చిత్రంగా నిలిచింది. నాన్ హాలిడే రోజు విడుదలై ఈ రేంజ్ వసూళ్లు అంటే మామూలు విషయం కాదు. తమిళ, మలయాళ వెర్షన్స్ కూడా మొదటిరోజు సత్తా చాటాయి.

    బాలీవుడ్ లో మూవీకి పాజిటివ్ టాక్ వస్తే.. వసూళ్లు పెరుగుతూ పోతాయి. వీకెండ్ మరో మూడు రోజులు ఉంది. పుష్ప 2కి పోటీలేదు. కాబట్టి కుమ్మేయడం ఖాయం. రూ. 500 కోట్లు హిందీ వెర్షన్ టార్గెట్ కాగా… అది వీకెండ్ నాటికే చేరుకునేలా ఉంది. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ క్రేజీ సీక్వెల్ మూడు సంవత్సరాల గ్యాప్ తో విడుదలై కూడా సంచలనాలు చేస్తుంది.