Pooja Hegde : వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ హిట్టు మీద హిట్టు కొడుతూ సౌత్ లోనే నెంబర్ 1 హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న పూజ హెగ్డే, అకస్మాత్తుగా మాయం అయిపోయింది, ఎటు పోయింది అసలు ఈమె అంటూ అభిమానులు సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. కొత్త హీరోయిన్స్ రాక కారణంగా ఈమెకు క్రేజ్ తగ్గిందని కొందరు, ఈమధ్య కాలం లో ఆమెకు ఎక్కువగా డిజాస్టర్ ఫ్లాప్స్ రావడం వల్ల దర్శక నిర్మాతలు పక్కన పెట్టేశారని మరికొందరు అనుకున్నారు. అందులో ఎంతో కొంత వాస్తవం ఉంది. కానీ పూజ హెగ్డే కి ఈమధ్య మన టాలీవుడ్ మార్కెట్ కంటే ఎక్కువగా బాలీవుడ్ మార్కెట్ పై మనసు పడిందని తెలుస్తుంది. అందుకే ఆమె టాలీవుడ్ పై ద్రుష్టి తగ్గించింది అంటూ చెప్పుకొస్తున్నారు. బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఈమె చేసిన సినిమాలన్నీ ఫ్లాప్స్ అయ్యాయి.
మరోసారి ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ బాలీవుడ్ లో షాహిద్ కపూర్ తో కలిసి ‘దేవా’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ నెల 31 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల అవ్వబోతున్న ఈ సినిమా గురించి బాలీవుడ్ ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ హీరో గా నటించిన ‘దేవా’ అనే చిత్రం స్పూర్తితో ఈ చిత్రం తెరకెక్కింది. రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. చూస్తుంటే పూజ హెగ్డే కి మంచి సూపర్ హిట్ పడేట్టు అనిపిస్తుంది. ఈ సినిమాకి సెన్సార్ సభ్యులు UA సెర్టిఫికెట్ ని జారీ చేసారు. అయితే ఈ చిత్రంలో ఒక సన్నివేశంలో పూజ హెగ్డే, షాహిద్ కపూర్ మధ్య ఒక ఘాటు రొమాన్స్ చేసుకుంటారట. అది మరీ హద్దులు దాటిన రేంజ్ లో ఉండడంతో సెన్సార్ బోర్డు ట్రిమ్ చేయమని ఆదేశించినట్టు తెలుస్తుంది.
దీంతో మేకర్స్ ఆ సన్నివేశానికి సంబంధించిన ఆరు సెకండ్స్ ని ట్రిమ్ చేశారట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఇక పూజ హెగ్డే తదుపరి చేయబోతున్న సినిమాల విషయానికి వస్తే తమిళం లో ఈమె లారెన్స్ తెరకెక్కిసైటున్న ‘కాంచన 4’ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే విధంగా సూర్య , కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘రెట్రో’ అనే చిత్రంలో కూడా ఈమె హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి. తెలుగులో మాత్రం ఈమె రీసెంట్ గా ఎలాంటి సినిమాలో కూడా నటించేందుకు సంతకం చేయలేదు. తనకి కెరీర్ ని ఇచ్చిన తెలుగు సినీ పరిశ్రమని పూజా హెగ్డే కావాలని దూరం పెడుతుందా?, లేక దర్శక నిర్మాతలే ఆమెని పట్టించుకోవడం లేదా అనేది తెలియాల్సి ఉంది.