Aryan Khan arrested: ముంబై డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కొద్ది రోజులుగా డ్రగ్స్ మాఫియా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమను ఊపేసిన డ్రగ్స్ కేసు ప్రస్తుతం ముంబై కేంద్రంగా వివాదాలు సృష్టిస్తోంది. డ్రగ్స్ కేసులో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్టయ్యారు. దీంతో ఆయనను విచారిస్తున్న ఎన్ సీబీ అధికారులు కీలక విషయాలు రాబడుతున్నారు. అతడితోపాటు అర్ఫాజ్ మర్చంట్, మున్ మున్ ధమేచాలను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ముంబై డ్రగ్స్ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆర్యన్ కు సైతం వైద్య పరీక్షలు నిర్వహించి జడ్జి ముందు హాజరు పరచారు. దీంతో ఈ కేసులో పలు ఆధారాలు వెలుగు చూస్తున్నాయి. పంజాబ్, ఢిల్లీ కేంద్రాలుగా డ్రగ్స్ దందా కొనసాగుతోందని తెలుస్తోంది. తీగలాగితే డొంకంతా కదులుతున్నట్లు ఈ కేసులో పలు విషయాలు ఆధారాలతో బయటకు వస్తున్నాయి. వీటన్నింటికి హైదరాబాద్ కేంద్రంగానే సాగుతున్నట్లు ప్రచారం సాగుతోంది.
హైదరాబాద్ లోని పారిశ్రామిక వాడల్లో కెమికల్ ఫ్యాక్టరీలో మత్తు పదార్థాల తయారు జరుగుతోందని తెలుస్తోంది. ముంబై నుంచి ఆస్రేలియాకు ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఇందులో భారీగా ముడుపులు చేతులు మారుతున్నట్లు సమాచారం. డ్రగ్స్ లో కీలకమైన ఎఫిడ్రిన్ తయారీ కేంద్రం కూడా హైదరాబాద్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది.
ఎన్ సీబీ అధికారుల విచారణలో అత్యంత దారుణమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో 10 మందిని అరెస్టు చేశారు. హైదరాబాద్ కేంద్రంగా జరిగే డ్రగ్స్ రవాణాలో పలువురు దాగి ఉన్నట్లు చెబుతున్నారు. కెమిస్రీ సైంటిస్ట్ గా పనిచేసే ఓ వ్యక్తి అధిక డబ్బులకు ఆశపడి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో తయారయ్యే డ్రగ్స్ ను ముంబై కేంద్రంగా విదేశాలకు తరలిస్తున్నట్లు కనుగొన్నారు. కీలకమైన ఆధారాల కోసం గాలిస్తున్నారు.