Shah Rukh Khan: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. దీంతో షారుఖ్ ఖాన్ తీవ్ర ఆవేదనతో ఉన్నాడు. తన సినీ భవిష్యత్ కు ఆర్యన్ ఖాన్ ఓ మచ్చ తెచ్చాడని తెలుస్తోంది. ఆర్యన్ ఖాన్ అరెస్టు విషయంలో అసలు ఏం జరిగింది? ఇందులో ఏదైనా రాజకీయ కోణం దాగి ఉందా? ఆర్యన్ ఖాన్ ను ఎందుకు టార్గెట్ చేశారు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో షారుఖ్ ఖాన్ మాత్రం ఆర్యన్ విషయంలో చాలా నష్టపోయాడని తెలుస్తోంది.

ఆర్యన్ ఖాన్ వ్యహారంలో షారుఖ్ ఖాన్ కు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఆయన కెరీర్ కే పెద్ద దెబ్బ తగులుతోంది. ఇదివరకు ఆయన ఒప్పుకున్న ప్రాజెక్టులన్ని చేయి జారి పోతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో ఆర్యన్ గురించి రకరకాల ప్రచారాలు పెరిగిపోతున్నాయి. దీంతో షారుఖ్ ఖాన్ తన భవిష్యత్ పై బెంగగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బైజూస్ బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి షారుఖ్ ను తప్పించారు.
ఆయన చేస్తున్న సినిమాలు కూడా సమయానికి విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ఆయన తన భవిష్యత్ పై భయాందోళన చెందుతున్నాడు. ప్రకటనలు, సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయే పరిస్థితి ఎదురైంది. దీంతో షారుఖ్ ఖాన్ కలత చెందుతున్నట్లు కనిపిస్తోంది. ఇన్నాళ్లు నిలబెట్టుకున్న ఇమేజ్ ఒక్కసారిగా డ్యామేజ్ కావడంతో ఏం చేయలేకపోతున్నారని పలు వార్తలు వినిపిస్తున్నాయి.
ఆర్యన్ ఖాన్ ను త్వరలో బాలీవుడ్ లో పరిచయం చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్న క్రమంలో అతడి అరెస్టు తో కంగుతిన్నాడు. డ్రగ్స్ కేసులో అరెస్టు కావడంతో అతడి కెరీర్ ఏమైపోతుతందోనని బెంగ పెట్టుకున్నాడు. దీంతో భవిష్యత్ ఎలా ఉంటుందోనని లోలోపలే కుమిలిపోతున్నాడు. తానొకటి అనుకుంటే దైవమొకటి తలచిందన్నట్లు మథనపడుతున్నాడు.
అయితే జైలు నుంచి విడుదలయ్యాక ఆర్యన్ ను విదేశాలకు పంపే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజులు యూఎస్, యూకే తదితర దేశాలకు పంపించి అక్కడే ఉంచి పరిస్థితి సద్దుమణిగాక ఇండియాకు రప్పించేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఆర్యన్ విడుదల విషయంలో ఇంకా స్పష్టత రావడం లేదు. దీంతో ఆర్యన్ ఖాన్ అరెస్టు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.