spot_img
Homeఎంటర్టైన్మెంట్Jawan: ‘షారుఖ్’ ‘జవాన్’.. తెలుగు రాష్ట్రాల్లో ఏంటీ క్రేజ్

Jawan: ‘షారుఖ్’ ‘జవాన్’.. తెలుగు రాష్ట్రాల్లో ఏంటీ క్రేజ్

Jawan: సూపర్ హిట్ సినిమా పఠాన్ తర్వాత మరోసారి బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ లీడ్ రోల్ లో మన ముందుకు రానున్న సినిమా జవాన్. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన జవాన్ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ అవుతుంది. బాలీవుడ్ స్టార్ తో తమిళ స్టార్ డైరెక్టర్ కాంబో ఈ సినిమాపై అంచనాలు పెంచేలా చేసింది. కాగా ఈ సినిమాపై హిందీ, ఇక తమిళ వారికే కాదు…తెలుగు వారికి కూడా భారీ అంచనాలు ఉన్నాయి అని ఈ సినిమా ప్రీ బుకింగ్ చూస్తే అర్థమవుతుంది.

రిలీజ్ ఇంకా వారం రోజులు ఉంది అనగానే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేశారు. ఈ అడ్వాన్స్ బుకింగ్స్ లో షారుఖ్ జవాన్ దూకుడు చూపిస్తొంది. ఈ సినిమా తెలుగు వర్షన్ కి తెలుగు రాష్ట్రాలలో బుకింగ్స్ సూపర్ గా ఉండడం అందరిని ఆశ్చర్యపరిస్తోంది.

ఈ చిత్రానికి హైదరాబాద్‌లో, తిరుపతిలో అభిమానులు పొటెత్తుతున్నారు. ఇప్పటికే 75 శాతం అక్యుపెన్సీ నమోదైంది. కాగా ఈ రెండు ప్రదేశాలలోనే కాదు తెలుగు రాష్ట్రాలలోని ఎన్నో ప్రదేశాలలో టికెట్లు ఓపెన్ అవ్వగానే ఈ చిత్రానికి దాదాపు బుక్ అయిపోయాయి. బాలీవుడ్ సినిమాలలో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలలో అత్యంత ప్రీ బుకింగ్స్ సాధించిన హిందీ సినిమాగా మిగిలనుంది.

అంతేకాదు ఇప్పటికే నార్త్ ఇండియా, ఓవర్సీస్ లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరిగాయి. ఇక ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ జవాన్ రికార్డ్ ఓపెనింగ్స్ ని సాధించడం ఈ సినిమాపై ప్రేక్షకులకు ఉన్న అంచనాలను చెప్పకనే చెబుతోంది.

ఇక ఈ చిత్రంలో షారుక్ సరసన నయనతార హీరోయిన్గా నటిస్తుండగా, కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి విలన్ గా కనిపించనున్నాడు. ఇక అనిరుద్ రవిచంద్రన్ సంగీతమందిస్తున్న ఈ సినిమా డిజిటల్, సాటిలైట్ మరియు మ్యూజిక్ రైట్స్ తో సహా రూ.250 కోట్ల బిజినెస్ చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.కాబట్టి ‘జవాన్’ సినిమాకి మొదటి రోజు పాజిటివ్ టాక్ వస్తే కచ్చితంగా ‌ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అన్నడంలో సందేహం లేదు.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...
Oktelugu Epaper
Exit mobile version