Homeఎంటర్టైన్మెంట్Serial Actress Roshni Walia: ‘తాగు.. ఎంజాయ్ చేయి.. కానీ ప్రొటెక్షన్ వాడు..’ హీరోయిన్ కు...

Serial Actress Roshni Walia: ‘తాగు.. ఎంజాయ్ చేయి.. కానీ ప్రొటెక్షన్ వాడు..’ హీరోయిన్ కు తల్లి సలహా ఇదీ

Serial Actress Roshni Walia: ప్రపంచంలో భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రత్యేక స్థానం ఉంది. వేల ఏళ్ల చరిత్ర కలిగిన హిందూ జీవన విధానాన్ని పాశ్చాత్యులు కూడా గౌరవిస్తారు. అయితే మారుతున్న జీవన విధానం రీత్యా నాగరికత కొత్త పుంతలు తొక్కుతుంది. అనాదిగా ఉన్న కొన్ని ఆచారాలు మంటగలిసి పోతున్నాయి. భారతీయ సమాజంలో పెళ్ళికి ఎంతో ప్రాధ్యానత ఉండేది. పెళ్ళికి ముందు శృంగారం, పెళ్లి చేసుకోకుండా ఆడా మగా కలిసి జీవించడం అపరాధంగా భావించేవారు. ఈ విలువలకు ఏనాడో తూట్లు పడ్డాయి.

ఇండియన్ సొసైటీ లో లివ్ ఇన్ రిలేషన్ షిప్ కల్చర్ ఎక్కువైంది. ముప్పై నలభై ఏళ్ళు వస్తున్నా అమ్మాయిలు, అబ్బాయిలు వివాహం చేసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. అలాగని వారు సంసారిక జీవితానికి దూరంగా ఉంటున్నారని కాదు. వివాహం చేసుకోకుండానే కలిసి జీవించే జంటల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఇద్దరికీ నచ్చినంత కాలం కలిసి జీవించడం, లేదంటే విడిపోవడం. సెలెబ్రిటీల నుండి సామాన్యుల వరకు ఇదే పంథా. కొన్నాళ్ల సాహచర్యం అనంతరం నచ్చితే వివాహం చేసుకుంటున్న జంటలు కూడా ఉంటున్నారు. విగ్నేష్ శివన్-నయనతార, రన్బీర్ కపూర్-అలియా భట్ ఈ కోవకే వస్తారు.

Also Read: ముట్టుకుంటే మాసిపోయే తమన్నా ‘అందాలు’.. చూసి తరించండి

ఎలాంటి వాటిని తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నారని ఒక యువ నటి కామెంట్స్ చూస్తే అర్థం అవుతుంది. బాలీవుడ్ లో చిత్రాలు చేస్తున్న రోషిని వాలియా తాజాగా చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. ఆమె మాట్లాడుతూ.. మా అమ్మ చాలా ట్రెండీగా ఉంటుంది. ఎంజాయ్ చేయమంటుంది. అయితే ప్రొటెక్షన్ వాడమంటుంది. మా అక్కకు కూడా ఇదే చెబుతుంది. బయటకు వెళ్లి పార్టీ చేసుకోమంటుంది. ఇంటికి తిరిగి వచ్చాక ఇవాళ తాగలేదా అని అడుగుతుంది… అని అన్నారు. రోషిని కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి.

సమాజంలో ఇలాంటి తల్లులు కూడా ఉన్నారా? అని జనాలు వాపోతున్నారు. యూపీకి చెందిన రోషిని తల్లి పేరు స్వీటీ వాలియా. ప్రస్తుతం వీరు ముంబైలో ఉంటున్నారు. 2012లో రోషిని సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. మై ఫ్రెండ్ గణేశా 4 ఆమె ఫస్ట్ మూవీ. అనంతరం ఓ అరడజను చిత్రాలు చేసింది. అలాగే సీరియల్స్ లో నటించింది. అజయ్ దేవ్ గణ్ హీరోగా తెరకెక్కిన సన్ ఆఫ్ సర్దార్ మూవీలో రోషిని సబ అనే ఓ పాత్ర చేసింది. ఈ చిత్రం ఆగస్టు 1న విడుదల కానుంది.

Exit mobile version