Keethi Bhat Revealed Shocking Facts: బుల్లితెర హీరోయిన్, బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ కీర్తి భట్(Keerthi Bhatt) రీసెంట్ గానే తన ప్రియుడు కార్తీక్ తో బ్రేకప్ చేసుకున్న సంఘటన సోషల్ మీడియాలో సంచలనం రేపింది. చిన్ననాటి స్నేహితుడైన కార్తీక్ తో కీర్తి భట్ 2023 వ సంవత్సరం లో నిశ్చితార్థం చేసుకుంది. అప్పటి నుండి వీళ్లిద్దరు లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. కలిసి ఫోటోలు దిగడం, ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేయడం వంటివి చాలానే చేశారు. ఇద్దరు కలిసి ఎన్నో టీవీ ప్రోగ్రామ్స్ లో కూడా జంటగా పాల్గొన్నారు. అమ్మా, నాన్న లేని కీర్తి భట్ కి ఎట్టకేలకు మంచి తోడు దొరికింది, ఇక సంతోషంగా ఉంటుందని భావించిన ఆమె అభిమానులకు ఒక్కసారిగా ఇలా వీళ్లిద్దరు విడిపోయారు అనే వార్త బయటకు రావడం తో షాక్ కి గురయ్యారు.
కీర్తి భట్ బ్రేకప్ గురించి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టిన మరుసటి రోజు కార్తీక్ స్పందిస్తూ, ‘నేను విడిపోవాలని కోరుకోలేదు, ఆమెని పెళ్లి చేసుకుందామని అనుకున్నాను, కానీ నేను ఆర్థికంగా ఇంకా స్థిరపడలేదని నన్ను వదిలేసింది, నా కంటే బెటర్ ఛాయస్ గా వేరొకరు దొరికారు అని చెప్పింది, చాలా వరకు ఆమెని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశాను. నా కుటుంబ సభ్యులు కూడా బ్రతిమిలాడారు, కానీ ఆమె నిర్ణయం తీసేసుకుంది’ అంటూ చెప్పుకొస్తూ బాగా ఎమోషనల్ అయ్యాడు. అప్పటి నుండి కీర్తి భట్ పై సోషల్ మీడియా లో ఒక రేంజ్ ట్రోల్స్ రావడం మొదలయ్యాయి. ఒకప్పుడు మహేష్ అనే సీరియల్ హీరో తో ప్రేమాయణం నడిపింది అని, ఆ తర్వాత అతనికి బ్రేకప్ చెప్పి కార్తీక్ తో రిలేషన్ పెట్టుకుందని, ఇప్పుడు అతనికి కూడా బ్రేకప్ చెప్పి మరొకరితో రిలేషన్ పెట్టుకుంది అంటూ సోషల్ మీడియా లో ఇలా ఎన్నో రకాల వార్తలు వచ్చాయి.
ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే ఈమె ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ ‘కార్తీక్ తో నిశ్చితార్థం జరిగిన తర్వాత నేను ఒక బాధలో ఉండిపోయి, తట్టుకోలేక ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాను, కానీ నా అదృష్టం బాగుండి ఆ సమయం లో ఎవరో చూసి నన్ను కాపాడారు. తన నిశ్చితార్థం కి సంబంధించిన ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ లో పెట్టినప్పుడు, కార్తీక్ తో పెళ్లి ఎందుకు, నీకు అసలు సెట్ కాడు అని అనేవారు. ఆ సమయం లో నా మానసిక పరిస్థితి దారుణంగా ఉన్నింది. చాలా డిస్టర్బ్ అయ్యాను. అసలు జీవితాన్ని కొనసాగించగలనా అనే అనుమానం ఉండేది’ అంటూ చెప్పుకొచ్చింది కీర్తి భట్. ఇంకా ఆమె ఏమి మాట్లాడిందో ఈ క్రింది వీడియో లో చూడండి.
