Keerthi Bhat: టీవీ సీరియల్స్ లో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరై, బిగ్ బాస్ సీజన్ 6 లో టాప్ 3 కంటెస్టెంట్ గా నిలిచి, రీసెంట్ గా స్టార్ మా ఛానల్ లో మొదలైన ‘బీబీ జోడి 2’ లో ఒక కంటెస్టెంట్ గా కొనసాగుతున్న కీర్తి భట్, ఇప్పుడు వార్తల్లో నిల్చింది. రీసెంట్ గానే ఈమె తన ప్రియుడు విజయ్ కార్తీక్ తో నిశ్చితార్థం జరుపుకుంది. అతి త్వరలోనే అతనితో పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఈ తరుణం లో నిన్న రాత్రి ఆమె తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా నిశ్చితార్థం ని రద్దు చేసుకుంటున్నట్టు ఒక పోస్టు ని పెట్టి అందరినీ షాక్ కి గురి చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ నా జీవితం లోని, నా మనసుకి అతి దగ్గరైన బంధానికి ముగింపు పలుకుతున్నాను. ఈ బంధం చాలా కాలం నుండి సాగుతుంది, అది మీ అందరికీ తెలిసిందే. కానీ జీవితాంతం ఈ బంధం తో కొనసాగలేనని అర్థం అయ్యింది, భార్య భర్తలుగా కలిసి మెలగలేం అని అనిపిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చింది కీర్తి భట్.
ఇకపై అతనితో స్నేహం గా కలిసి ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది. అయితే సోషల్ మీడియా లో భవిష్యత్తులో తనపై రాబోయే రూమర్స్ గురించి ముందుగానే స్పందిస్తూ ‘జీవితం ఎప్పుడూ ఒక యుద్ధం లాంటిది. ఎలాంటి కష్టతరమైన సందర్భం వచ్చినా దృడంగా నిలబడి పోరాడేందుకే ప్రయత్నం చేస్తాను కానీ రాజీ పడే సమస్యే లేదు. అలాంటి జీవితం కంటే, నా సంతోషం కోసం బ్రతకడమే నాకు ముఖ్యం. కాబట్టి దయచేసి మీ ఊహలతో అపోహలను సృష్టించకండి’ అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. కీర్త్ భట్, విజయ్ కార్తీక్ జంట నిశ్చితార్థం 2023 వ సంవత్సరం లో జరిగింది. అప్పటి నుండి వీళ్లిద్దరికీ సంబంధించిన ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ లో చాలానే అప్లోడ్ అయ్యాయి.
పలు టీవీ షోస్ కి కూడా వీళ్లిద్దరు కలిసి హాజరు అయ్యారు. కీర్తి భట్ కి తల్లిదండ్రులు లేరు, ఈ సానుభూతి ఆమెపై బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు ఆడియన్స్ లో బలంగా ఉండేది. అందుకే ఆమె టాప్ 3 వరకు వచ్చిందని కూడా అందరూ అంటుంటారు. అయితే అప్పట్లో టీవీ సీరియల్ హీరో మహేష్ తో ప్రేమాయణం నడిపింది కీర్తి భట్. బిగ్ బాస్ షో లో ఫ్యామిలీ వీక్ అప్పుడు కూడా ఈమె తరుపున మహేష్ వచ్చాడు. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ అతనిత్ బ్రేకప్ అయ్యింది. ఆ తర్వాత విజయ్ కార్తీక్ తో రిలేషన్ పెట్టుకున్న కీర్తి భట్ ని చూసి, కనీసం, ఇప్పటికైనా నీ జీవితానికి ఒక తోడు దొరికిందని ఆమె అభిమానులు సంతోషించారు. కానీ ఇప్పుడు అది కూడా బ్రేకప్ అవ్వడం తో వాళ్ళు బాధపడుతున్నారు.