Jana Nayagan: తమిళ స్టార్ హీరో విజయ్(Thalapathy Vijay) నటించిన ‘జన నాయగన్'(Jana Nayagan Movie) చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించిన ఘటన పై హైకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రం లో దేశం లోని మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా చాలా సన్నివేశాలు ఉన్నాయని హైకోర్టు చెప్పుకొచ్చింది. అందుకే ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ ఇవ్వాలని సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను కొట్టి పారేస్తున్నామని హై కోర్టు పేర్కొంది. సెన్సార్ బోర్డు చైర్మన్ అధికారుల వాదనలు వినకుండా సింగిల్ బెంచ్ జడ్జి తీర్పు ఎలా ఇస్తారు?, ఇది సరైన పద్దతి కాదు అంటూ హై కోర్టు తప్పుబట్టింది. అదే విధంగా ఆ చిత్ర నిర్మాతలు U/A 16+ సర్టిఫికేట్ ఇవ్వాలని కోరారు, కానీ ఎందుకు ఇవ్వాలి అనేందుకు ఆధారాలు మాత్రం ఇవ్వలేదంటూ హైకోర్టు చెప్పుకొచ్చింది.
సెన్సార్ బోర్డు సమీక్ష సభ్యుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చిత్రాన్ని రివైజింగ్ కమిటీ కి పంపాలని నిర్ణయించినట్టు కోర్టు ప్రకటించింది. అయితే ఈ చిత్ర నిర్మాతలకు కోర్టు మరోసారి పిటీషన్ దాఖలు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పుకొచ్చింది మద్రాసు హై కోర్టు. అన్ని రకాల వాదనలు విన్న తర్వాతే, రివైజింగ్ కమిటీ కి ఈ చిత్రాన్ని పంపాలా వద్దా అనే విషయాన్నీ సింగిల్ జడ్జి తిరిగి నిర్ణయం తీసుకోవచ్చని ధర్మాసనం తీర్పులో పేర్కొంది. స్వయంగా హై కోర్టు ఇప్పుడు ఇందులో మత విశ్వేశాలను రెచ్చగొట్టే సన్నివేశాలు జత చేసారని చెప్పడం తో, సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి సర్టిఫికేట్ ఇవ్వకుండా ఉండడం లో ఎలాంటి కుట్ర లేదనే విషయం జనాలకు స్పష్టంగా అర్థం అయ్యింది. డైరెక్టర్ ఇలాంటి సున్నితమైన సన్నివేశలను తీసేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉందంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ చిత్రం నందమూరి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ కి రీమేక్ గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం లో అలాంటి సన్నివేశాలు ఏమి లేవు కదా, ‘జన నాయగన్’ కి ఎందుకు ఇలా అడ్డంకులు పెడుతున్నారంటే, విజయ్ TVK పార్టీ ని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి, పొలిటికల్ యాంగిల్ ని కూడా ఈ చిత్రం లో జోడించారని, అవి వివాదాస్పదంగా ఉండడం వల్లే ఇన్ని అడ్డంకులు ఏర్పడ్డాయని, సినిమాని సినిమా వరకు పరిమితం చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని, సినిమాలో రాజకీయ ఉద్దేశ్యాలు పెట్టాలని అనుకున్నప్పుడే ఇలాంటి సమస్యలు ఎదురు అవుతాయని అంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడు ఈ చిత్రంలో ఆ సన్నివేశాలు మొత్తం తొలగిస్తే కానీ విడుదలయ్యే సూచనలు కనిపించడం లేదు. చూడాలి మరి ఏమి జరగబోతుందో.